twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తోడల్లుళ్లుగా కనిపించబోతున్న వెంకటేష్-వరుణ్ తేజ్

    By Bojja Kumar
    |

    తెలుగులో ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ సినిమాల జోరుపెరుగుతోంది. త్వరలో విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్లో 'ఎఫ్ 2' '(ఫన్ అండ్ ఫ్రస్టేషన్) అనే సినిమా రాబోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో దిల్ రాజు నిర్మించబోతున్నారు.

    ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఇందులో వెంకీ-వరుణ్ తోడల్లుళ్లు'గా కనిపించనున్నారని తెలుస్తోంది. ఇద్దరి మధ్య జరిగే సీన్లు ఫన్ క్రియేట్ చేసేలా ఆసక్తికర స్క్రిప్టు రాసుకున్నాడట అనిల్ రావిపూడి.

    Venkatesh, Varun Tej movie latest updates

    స్టార్ హీరోలు ఇద్దరూ తోడల్లుళ్లుగా కనిపించిన కథలు సినిమాగా వచ్చి చాలా కాలం అయింది. ఇటు ఫ్యామిలీ ప్రేక్షకులను అటు యూత్‌ను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉండబోతోందని అంటున్నారు. పైగా ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత కావడంతో అంచిన అంచనాలున్నాయి.

    జూన్ 23న పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం లాంచ్ కాబోతోంది. ఇదే నెల 30 నుంచి రెగ్యులర్ షూటింగు హైదరాబాద్ ప్రారంభం కానుంది. జూలై 20వకు తొలి షెడ్యూల్ నాన్ స్టాప్ జరుగుతుందని సమాచారం. వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

    English summary
    After the success of Tholi Prema, actor Varun Tej is on a career high and is signing multiple films. The actor on Sunday announced that he will soon be working in a film, to be directed by Anil Ravipudi. It will also star Daggubati Venkatesh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X