Don't Miss!
- Sports రోహిత్ శర్మ ప్లేస్‌లో..!!
- News Money astrology March 29th: ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం!!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
తోడల్లుళ్లుగా కనిపించబోతున్న వెంకటేష్-వరుణ్ తేజ్
తెలుగులో ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ సినిమాల జోరుపెరుగుతోంది. త్వరలో విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్లో 'ఎఫ్ 2' '(ఫన్ అండ్ ఫ్రస్టేషన్) అనే సినిమా రాబోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో దిల్ రాజు నిర్మించబోతున్నారు.
ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఇందులో వెంకీ-వరుణ్ తోడల్లుళ్లు'గా కనిపించనున్నారని తెలుస్తోంది. ఇద్దరి మధ్య జరిగే సీన్లు ఫన్ క్రియేట్ చేసేలా ఆసక్తికర స్క్రిప్టు రాసుకున్నాడట అనిల్ రావిపూడి.
స్టార్ హీరోలు ఇద్దరూ తోడల్లుళ్లుగా కనిపించిన కథలు సినిమాగా వచ్చి చాలా కాలం అయింది. ఇటు ఫ్యామిలీ ప్రేక్షకులను అటు యూత్‌ను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉండబోతోందని అంటున్నారు. పైగా ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత కావడంతో అంచిన అంచనాలున్నాయి.
జూన్ 23న పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం లాంచ్ కాబోతోంది. ఇదే నెల 30 నుంచి రెగ్యులర్ షూటింగు హైదరాబాద్ ప్రారంభం కానుంది. జూలై 20వకు తొలి షెడ్యూల్ నాన్ స్టాప్ జరుగుతుందని సమాచారం. వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.