సీటు కింద పడిపోయి నవ్వుతారు, మా కోబ్రో వెంకీ ఇరగదీశారు: వరుణ్ తేజ్

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోలుగా తమన్నా, మెహ్రీన్‌ హీరోయిన్స్‌గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం 'ఎఫ్‌ 2'. 'ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌' ట్యాగ్‌ లైన్‌. అనిల్‌ రావిపూడి దర్శకుడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం మీడియాతో ఇంటరాక్ట్ అయింది.

వెంకటేష్ మాట్లాడుతూ... ఈ పండక్కి ఎఫ్ 2 రావడం ఆనందంగా ఉంది. సంక్రాంతికి ఒక ఫన్ ఫిల్మ్ వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇపుడు ఎఫ్ 2లో మమ్మల్ని సంక్రాంతి అల్లుళ్లుగా చూపించి అనిల్ ఫన్ ఎలిమెంట్స్ తారా స్థాయికి తీసుకెళ్లారు. చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

నేను సెట్లో ఒక హీరోలా ఎప్పుడూ ఉండను: వెంకీ

నేను సెట్లో ఒక హీరోలా ఎప్పుడూ ఉండను: వెంకీ

సెట్లో దర్శక నిర్మాతలతో నా రిలేషన్ షిప్ యూనిక్‌గా ఉంటుంది. ఒక హీరోలాగా ఎప్పుడూ అనుకోను. ఒక అసిస్టెంట్ డైరెక్టర్, ఆడియన్ మాదిరిగా కథ వింటాను. సినిమాలో ఏది బావుంది? ఏది బాగోలేదు అనేది దర్శకుడితో డిస్క్రస్ చేస్తూనే ఉంటా. దిల్ రాజుగారితో నేను కో ప్రొడ్యూసర్ మాదిరిగా, ప్రొడక్షన్ మేనేజర్ మాదిరిగా ఉంటాను. ఈ సినిమాలో అనిల్ నాతో చాలా డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇప్పించాడు. వరుణ్, రాజేంద్రప్రసాద్ గారితో పని చేయడం ఆనందంగా ఉందని వెంకటేష్ తెలిపారు.

నవ్వుకోవడానికి ఆయన సినిమాలే చూసేవాడిని

నవ్వుకోవడానికి ఆయన సినిమాలే చూసేవాడిని

వరుణ్ తేజ్ మాట్లాడుతూ... అనిల్ రావిపూడి లాంటి హ్యాండ్సమ్, టాలెంటెడ్ డైరెక్టర్‌తో పని చేయడం హ్యాపీగా ఉంది. తొలిసారి ఇందులో మాస్, కామెడీ పాత్ర ట్రై చేశాను. దిల్ రాజుగారు, శిరీష్ గారు బాగా సపోర్ట్ ఇచ్చారు. నేను చిరంజీవిగారి సినిమాలు, బాబాయ్ గారి సినిమాలు చూస్తూనే ఉంటాను. నవ్వుకోవడానికి రాజేంద్రప్రసాద్ సినిమాలు చూసేవాడిని. ఆయన కామెడీ ఒకటే కాదు, సూపర్ వెర్సటైల్ యాక్టర్ అని తెలిపారు.

తమన్నా మా అందరి డార్లింగ్

తమన్నా మా అందరి డార్లింగ్

నాకు సాంగ్ షూటింగ్ అంటే కాళ్లు షేకవుతాయి. తమన్నాడాన్స్ ఇరగదీస్తారని అందరికీ తెలుసు. ఒక చిన్న స్టెప్ ఇస్తే మేమంతా కూర్చుని మాట్లాడుకుంటాం. తను మాత్రం పక్కకు వెళ్లి ప్రాక్టీస్ చేస్తుంది. అంత డెడికేషన్ ఉంటుంది. తమన్నా వెంకీగారి డార్లింగ్ కాదు, మా అందరి డార్లింగ్ అని వరుణ్ తేజ్ వ్యాఖ్యానించారు.

సీట్లో నుంచి కిందపడి నవ్వుతారు

సీట్లో నుంచి కిందపడి నవ్వుతారు

గతంలో వెంకీగారితో ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు', ‘వాసు' సినిమాల్లో చిన్న క్యారెక్టర్ వస్తే చేయలేక పోయాను. మూడో సారి ఎఫ్ 2 రూపంలో వెంకటేష్ గారితో కుదిరింది. ఆయన చాలా కంఫర్ట్ క్రియేట్ చేశారు. ఆయనతో మళ్లీ సినిమా చేసే అవకాశం వస్తే ఏమీ అడగకుండా ఓకే చెబుతాను. ఈ సినిమాలో సీటు కింద పడిపోయి నవ్వేంత నవ్వులు ఎన్నాయని వరుణ్ తేజ్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X