ఎఫ్2: రైల్వే కూలీలుగా మారిన వెంకీ, వరుణ్ తేజ్
వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీ స్టారర్‌గా 'ఎఫ్-2 -ఫన్ అండ్ ఫ్రస్టేషన్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో దిల్ రాజు నిర్మిస్తున్నారు.
దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఇందులో వెంకటేష్, వరుణ్ తేజ్ రైల్వే కూలీలుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. వెంకీ కూలీ నెం.1గా, వరుణ్ తేజ్ కూలీ నెం. 786గా కనిపించబోతున్నారు.
ఈ చిత్రంలో వెంకీ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ ఫిర్జాదా నటిస్తున్నారు. అయితే ఈ ఇద్దరూ సినిమా మొత్తం కూలీలుగా కనిపించబోతున్నారా? లేక ఏదైనా సన్నివేశానికే పరిమితమా? అనేది తెలియాల్సి ఉంది.

ఎంటర్టెన్మెంట్ మసాలా బాగా కలిపి తీయడంలో దర్శకుడు అనిల్ రావిపూడికి మంచి పేరుంది. ఇక వెంకీ ఉంటే వినోదం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మూవీకి మెగా ఫ్యామిలీ హీరో కూడా తోడవ్వటంతో మంచి అంచనాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications











