వెంకటేష్ ‘వివేకానంద’ ఖరారు.. డిటేల్స్

By Srikanya

ఎప్పటినుంచో వెంకటేష్ కి 'వివేకానంద"చేయాలనే ఆసక్తి ఉంది. ఈ సబ్జెక్టుపై నీలకంఠ కొంతకాలం కసరత్తులు సైతం చేసారు.అయితే మెటీరియలైజ్ కాలేదు. అయితే తాజాగా ఈ ప్రాజెక్టుకు వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాలీవుడ్ దర్శకుడు మణిశంకర్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. 2012 ఆగస్టులో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ చిత్రం స్క్రిప్టు వర్క్ పూర్తైంది. ఈ విషయాన్ని వెంకటేష్ మీడియాకు తెలియచేస్తూ..''వివేకానందుడంటే సాదాసీదా వ్యక్తి కాదు. ఓ డైనమైట్ ఆయన. ప్రపంచాన్ని జాగృతం చేసే శక్తిసామర్థ్యాలు కలిగినవాడు. ఆయన చెప్పిన ప్రతి వాక్యం మనల్ని ఉత్తేజితుల్ని చేస్తుంది. నేను ఆయనను బాగా ఆరాధిస్తాను.

మన మూడ్స్‌ని నాలుగ్గోడల మధ్యనే వదిలేయాలి కానీ, వాటితో ఈ అందమైన ప్రపంచాన్ని కలుషితం చేయొద్దని వివేకానందుని చెప్పిన బోధనను నేనెప్పటికీ మరచిపోలేను"" అన్నారు. ఇక వెంకటేష్ తాజాగా నటించిన బాడీగార్డ్ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఆ చిత్రం అనంతరం మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందే చిత్రంకు వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గోపీమోహన్,కోన వెంకట్ ఆ చిత్రం స్క్రిప్టుని రెడీ చేస్తున్నారు. జనవరిలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ లోగా మహేష్ తో కలిసి చేస్తున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం షూటింగ్ వైజాగ్ జరుగుతోంది. అడ్డాల శ్రీకాంత్ డైరక్ట్ చేస్తున్న ఆ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X