వెంకటేష్ ‘వివేకానంద’మూవీ డిటేల్స్
విక్టరీ వెంకటేష్ త్వరలో 'వివేకానంద' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు మహనీయుల పాత్రల్లో కనిపించని వెంకటేష్ ఈ సినిమాపై ఎంతో ఆసక్తి గా ఉన్నారు. గత కొంత కాలంగా ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయి. తాజాగా అందిన సమాచారం ప్రకారం....సెప్టెంబర్ నెలలో ఈ సినిమా సెట్స్ మీదకు రానుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న మణి శంకర్ సినిమాకు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై ఉన్నారని తెలుస్తోంది యువతకు సందేశాన్ని ఇచ్చే ఫిలాసఫికల్ మూవీగా దీన్ని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రస్తుతం వెంకీ తన తాజా సినిమా బాడీగార్డు విడుదలపై ఎంతో ఆసక్తిగా ఉన్నాడు. జనవరి 14న విడుదల కానున్న ఈ చిత్రం ఇప్పటికే పాసిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం తర్వాత వెంకీ మెహర్ రమేష్ దర్శకత్వంలో 'డాన్' పాత్రలో ఓ సినిమాతో పాటు దిల్ రాజు బ్యానర్లో, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తన కోస్టార్ మహేస్ బాబుతో కలిసి 'సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు' అనే చిత్రంలో నటించబోతున్నారు.


Click it and Unblock the Notifications











