తండ్రి మాటకు వెంకటేష్ సరేనంటాడా?
ఒకప్పుడు తన బ్యానర్ లో సూపర్ హిట్స్ ఇచ్చి తన జీవితం సినిమాకే అంకితం చేసిన సీనియర్ నిర్మాత డి.రామానాయుడు. వయస్సు మీదపడిన ఆయన ఇప్పటికీ సినిమాలు చేస్తూ తనను తాను బిజీ చేసుకుంటున్నారు. ఆయన కుమారుడు సురేష్ బాబు సినిమాలు తీయటానికి భయపడుతున్నా నాయుడుగారు మాత్రం తన మీద,కథ మీద నమ్మకం కోల్పోక ఇంకా ప్రస్దానం కొనసాగిస్తున్నారు.ఈ నేపధ్యంలో ఆయనకి తన మనవడు నాగచైతన్యతోనూ, తన కుమారుడు వెంకటేష్ తోనూ సినిమా చేయాలని ఆలోచనలో ఉన్నారు. నాగచైతన్య విషయం ప్రక్కన పెడితే వెంకటేష్ తో ఆయన మనసంతా నువ్వే దర్సకుడు వియన్ ఆదిత్యతో సినిమా ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నారు.
ఈ విషయం ప్రస్దావిస్దూ రామానాయుడు.."వెంకటేశ్‌కి భూపతిరాజా చెప్పి కథ బాగుంటుంది. వాడు సరేనంటే ఈ సినిమాని ఆదిత్య డైరెక్షన్‌లో తీస్తాను' అని ఆయన చెప్పారు. అంటే వెంకటేష్ ఈ ప్రాజెక్టుకి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మరి వరస ప్లాపుల్లో ఉన్న వియన్ ఆదిత్యతో వెంకటేష్ సినిమా చేస్తాడా అనేది ఇప్పుడు రామానాయుడుకి సస్పెన్స్. ఆయన కథను నమ్మి సినిమా చేస్తే ఆయన తర్వాత జనరేషన్ కేవలం కాంబినేషన్ ని నమ్మి మాత్రమే ముందుకెళ్లే పరిస్ధితి కనపడుతోంది.
ఈ పరిస్ధితుల్లో వియన్ ఆదిత్యకు వెంకటేష్ డేట్స్ ఎంతవరకూ ఇస్తాడనేది సందేహమే. అయితే తండ్రిమాటను కాదనకుండా ఒప్పుకున్నా ఒప్పుకోవచ్చు అంటున్నారు. ప్రస్తుతం వియన్ ఆదిత్య దర్శకత్వంలో రామానాయుడు నిర్మించిన 'ముగ్గురు' సినిమా ఈ నెల (ఆగస్ట్) 19న రిలీజ్ కాబోతోంది. ఇందులో నవదీప్, రాహుల్, అవసరాల శ్రీనివాస్ హీరోలుగా నటిస్తే, వారికి జోడీలుగా శ్రద్ధాదాస్, సంజన, సౌమ్య నటించారు. రీమాసేన్ మరో మెయిన్ రోల్ చేసింది.


Click it and Unblock the Notifications











