రాజమౌళి ‘ఈగ’ చిత్రంలో వాయిస్ ఓవర్ ఇచ్చే హీరో
ప్రముఖ దర్శకుడు రాజమౌళి రూపొందించనున్న'ఈగ" చిత్రంలో వాయిస్ ఓవర్ ని చెప్పటానికి వెంకటేష్ ని ఎంపిక చేసారని తెలుస్తోంది. అయితే ఇందుకు రామ్ చరణ్, ఎన్టీఆర్ పోటీ పడ్డారని, కానీ అప్పటికే వెంకటేష్ ని దానికి ఫైనల్ చేసి వారికి నో చెప్పారని చెప్తున్నారు. మర్యాద రామన్న చిత్రానికి సైకిల్ కి రవితేజ చేత డబ్బింగ్ చెప్పించి క్రేజ్ సంపాదించిన రాజమౌళి, ఈ చిత్రంలో వెంకటేష్ తో వాయిస్ ఓవర్ చెప్పించటం ద్వారా ఫ్యామిలీలకు పట్టే చిత్రమని చెప్పబోతున్నారు. ఇక తన సినిమాలోని కథాంశం ఏమిటో ఓపెనింగ్ రోజునే ఓపెన్ గా రాజమౌళి చెప్పేసారు.
'ఈగ" సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే 'తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే 'ఈగ" రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో 'ఈగ"గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై..అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ 'ఈగ"ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ" అన్నదే క్లుప్తంగా 'ఈగ" కథాంశం.


Click it and Unblock the Notifications











