వీరిద్దరి కాంబినేషన్ లో డైరెక్ట్ చిత్రం వస్తే పంచింగ్ గా ఉంటుంది...!
'నువ్వు నాకు నచ్చావ్", 'మల్లీశ్వరి" చిత్రాలకు అదిరిపోయే పంచింగ్ డైలాగులను అందించిన రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ఈ సారి వెంకీతో డైరెక్ట్ గా ఓ చిత్రాన్ని చేయడానికి ప్లాన్ చేసుకున్నాడట. అందుకోసం కథ కూడా రెడీ చేశాడని వార్తలు వస్తున్నాయి. 'అతడు", 'జల్సా" చాత్రాలతో దర్శకుడిగా తనని తాను నిరూపించుకున్న త్రివిక్రమ్ తర్వాత మహేష్ తో మళ్లీ చేస్తున్న చిత్రం..గత రెండు సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే.
మరి ఆ చిత్రం ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు సరి కదా మరో నాలుగైదు చిత్రాలకు మాటలు రాయడానికి ఒప్పుకున్నట్టుగా కూడా వార్తలు వస్తున్న త్రివిక్రమ్..వెంకీ చిత్రం మొదలు పెట్టేది ఎప్పుడో? ఒకవేళ మొదలు పెట్టినా...అది పూర్తయ్యేది ఎప్పుడో చెప్పడం మాత్రం కష్టం. కాకపోతే వెంకీ గత రెండు చిత్రాలకు ఆయన ఇచ్చిన పంచింగ్ డైలాగ్సే..సినిమాకి ప్రాణం పోయడంతో వీరిద్దరి కాంబినేషన్ లో డైరెక్ట్ చిత్రం వస్తే ఇంకెంత పంచింగ్ గా ఉంటుందో అని అందరూ ఊహించుకుంటున్నారు. మరి ఇది నిజంగా ఊహగానే ఉంటుందో లేక కార్యరూపం దాల్చుతుందో.. తెలుసుకోవాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











