నా కొడుకు హీరోగా ఆ చిత్రం: వెంకటేష్
వెంకటేష్ తన కుమారుడుని హీరో చెయ్యాలని ముచ్చటపడుతున్నారు. ఆయన ఈ విషయమై మాట్లాడుతూ..భవిష్యత్ లో దగ్గుపాటి కుటుంబం నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీకి నా కొడుకు రూపంలో మరో స్టార్ వస్తాడు. అయితే నా కుమారుడుని సినిమాల్లోకి తీసుకురావటానకి చాలా సమయముంది అన్నారు. అలాగే నా కొడుకు నాతో నటించటానికి ఆరాట పడుతున్నాడు. హాలీవుడ్ కరేటే కిడ్ ని రీమేక్ చేసి నన్న జాకీ ఛాన్ పాత్రలోనూ, తానేమో శిష్యుడు పాత్రలో చేస్తానని అంటున్నాడని చెప్పారు. ఇక త్వరలో తన తాజా చిత్రం బాడీగార్డ్ రీమేక్ ఆడియో విడుదల కానుంది. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో ఆయన ఇలా స్పందించారు. అలాగే తాను త్వరలో వివేకానంద చిత్రంలో చేయనున్నట్లు చెప్పారు.
బాలీవుడ్ దర్శకుడు మణిశంకర్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. 2012 ఆగస్టులో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ చిత్రం స్క్రిప్టు వర్క్ పూర్తైంది. ఆ చిత్రం అనంతరం మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందే చిత్రంకు వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గోపీమోహన్,కోన వెంకట్ ఆ చిత్రం స్క్రిప్టుని రెడీ చేస్తున్నారు. జనవరిలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ లోగా మహేష్ తో కలిసి చేస్తున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం షూటింగ్ వైజాగ్ జరుగుతోంది. అడ్డాల శ్రీకాంత్ డైరక్ట్ చేస్తున్న ఆ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











