చిరుకు వెంకీ శుభాకాంక్షలు!!!
తెలుగు ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ స్టైల్ చాలా ఢిఫరెంట్. సినిమాలలోనే కాదు బయట కూడా ఆయన చాలా ఫిలాసఫికల్ గా మాట్లాడుతూ ఉంటారు. ఫిలసాఫికల్ గా ఉండేవారికి అసూయాద్వేషాలు ఉండవు. చాలా ప్రశాంతంగా ఉంటారు. అదే వెంకీ డిఫరెంట్ అని చెప్పడానికి ఆస్కారం ఇచ్చింది.
తోటి నటుడు చిరంజీవి రాజకీయాలలోకి వచ్చే అంశాన్ని ప్రస్తావిస్తే శుభాకాంక్షలు చెప్పారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా చెబుతున్నాను...ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా గౌరవిస్తాను...ఇంకా చిరంజీవి ఏమీ ప్రకటించలేదు...ఇపుడే మాట్లాడడం సరికాదన్నాడు వెంకటేష్.


Click it and Unblock the Notifications











