మహష్ ని కలిసి ముచ్చట్లాడిన వెంకటేష్.
వెంకటేష్, మహేష్ ఇద్దరూ త్వరలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో చేయనున్నకలిసి చేయనున్న సంగతి తెలిసిందే.అయితే అంతకుముందే వీళ్ళద్దరూ కలిసి ముచ్చటించుకున్నారు. దూకుడు సెట్స్ మీదకు చివరి రోజున వెంకటేష్ వచ్చి ఆశ్చర్యపరిచారు. తర్వాత వీరిద్దరూ ప్రక్కకు వెళ్లి కూర్చుని చాలా సేపు మాట్లాడుకున్నారు. అలాగే వెంకటేష్ ..దూకుడు పెద్ద హిట్ కావాలని విషెష్ చెప్పారు.ఇక తన తాజా చిత్రం దూకుడు గురించి మహేష్ బాబు చాలా గ్యాప్ తర్వాత ట్వీట్ చేసారు. ఆయన మాటల్లోనే.. మా డైరక్టర్ మాటల ప్రకారం దూకుడు ఫస్టాఫ్ ఆర్.ఆర్ అవుట్ స్టాండింగ్. తమన్ కే ఈ ప్రశంసలు అన్నీ దక్కుతాయి. ధాంక్యూ తమన్.సెకెండాఫ్ కూడా ఇంతకన్నా బాగా చేస్తాడని ఆసిస్తున్నాను.నా వరకూ చెప్పాలంటే నేను గ్రేట్ వర్క్ చేస్తున్న ఫీలింగ్ లో ఉన్నాను. పని..పని..పని అన్నట్లుంది అన్నారు.ఇక ఈ చిత్రంలో మహేష్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. కామిడి ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ, కోన వెంకట్ మాటలు అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











