twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంకటేష్,అంజలి జపాన్ లో రొమాన్స్

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లో పెయిర్ గా అదరకొట్టిన వెంకటేష్ మరియు అంజలి మరోసారి 'మసాలా' సినిమాలో కనిపించనున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ సెప్టెంబర్ 3 నుండి ఒక పాట షూట్ కోసం జపాన్ వెళ్లనున్నారు. అక్కడ అందమైన లొకేషన్లలలో ఈ పాటను తీస్తారని చెప్తున్నారు. ఈ పాటతో చిత్రం షూటింగ్ పూర్తవుతుంది. రీసెంట్ గానే రామ్ పై ఓ పాటను ధాయ్ ల్యాండ్ లో చిత్రీకరించి వచ్చారు. అలాగే ఈ చిత్రంలో నాలుగు పాటలు, ఓ రీమిక్స్ సాంగ్ ఉండనున్నాయి. సెప్టెంబర్ 13 న ఈ చిత్రం విడుదల అయ్యే అవకాసం ఉంది.

    ఇక ఈ చిత్రంలో వెంకటేష్ ..విభిన్నమైన బాడీ లాంగ్వేజ్, వచ్చీ రాని ఇంగ్లీష్ మాట్లాడుతూ నవ్విస్తారు. మై ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్...మై సెకండ్ లాగ్వేజ్ ఇంగ్లీష్...మై బాడీ లాంగ్వేజ్ ఆల్సో ఇంగ్లీష్ వంటి ఫన్నీ డైలాగులు ఈ చిత్రంలో ఉంటాయి. ఈ మల్టీ స్టారర్ లో రామ్ మరో హీరో. షాజన్ పదాంసి అతని జోడి. ఎస్. ఎస్ థమన్ అందించిన సంగీతం త్వరలో విడుదలకానుంది. కె విజయభాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవి కిషోర్ .మరియు సురేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా హిందీలో విజయవంతమైన 'బోల్ బచ్చన్' కు రీమేక్.

    మరో ప్రక్క ఈ సినిమా ప్రచారాన్ని వైవిధ్యంగా చేపట్టేందుకు దర్శక,నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. 'వైవా' అనే షార్ట్ ఫిలిం ద్వారా అందరికీ పరిచయమైన హర్ష చెముడుతో ఓ వీడియోని రూపొందిస్తున్నారు. ఆ లఘు చిత్రం తరహాలోనే హర్ష.. వెంకటేష్‌, రామ్‌ని ప్రశ్నలు అడుగుతాడు. దానికి వారు చెప్పిన జవాబులతో వీడియోను రూపొందించారు. దీన్ని యూట్యూబ్‌లో త్వరలో విడుదల చేయనున్నారని చిత్ర వర్గాల సమాచారం.

    హిందీలో రూపొందిన 'బోల్ బచ్చన్'లో అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, అసిన్, ప్రచీ దేశాయ్, అస్రానీ, అర్చనా పూరణ్‌సింగ్ తదితరులు నటించారు. 'మసాలా' చిత్రంలో అజయ్ దేవగన్ పాత్రలో వెంకీ కనిపించనున్నారు. రామ్ సినిమాలపై తన మనోగతం గురించి వెల్లడిస్తూ 'నేను దర్శకుణ్ణి నమ్మి సినిమాలు చేస్తాను. ఫలానా కథ కావాలని ఏ దర్శకుణ్ణి కోరను. ఎందుకంటే నటుడిగా నేను ఒక్క కోణంలోనే ఆలోచిస్తాను. దర్శకులు వారి సృజనకు అనుగుణంగా నన్ను సరికొత్త పంథాలో ఆవిష్కరించాలని ఆలోచిస్తారు. కథ నచ్చితే దానికి వందశాతం న్యాయం చేయడంపైనే నేను దృష్టిపెడతాను' అని చెపుతున్నారు రామ్. సోలోగా సినిమాలు చేయడం వల్ల అంతగా కలిసి రాక పోవడంతో మల్టీ స్టారర్ సినిమాలపై దృష్టి సారించిన వెంకటేష్....అలాంటి స్క్రిప్టులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

    English summary
    Masala film Song on Venky & Anjali from Sept 3rd in exotic locales of Japan....With this, the film will be complete in all respects. Ram will be seen as the other hero in this multi-starrer and he will have Shazahn Padamsee for company. The audio album of the movie will be out soon and Thaman has composed the music.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X