'మిస్టర్ మజ్ను' ప్రీమియర్ షో టాక్: అఖిల్ కేక పెట్టించాడు, మళ్ళీ వెంకీ అట్లూరి మ్యాజిక్.. కానీ!

Recommended Video

Mr Majnu Premier Show Talk From Audience | Filmibeat Telugu

మూడవ చిత్రంతో ఎలాగైనా హిట్ అందుకోవాలని అఖిల్ మిస్టర్ మజ్నుగా మన ముందుకు వచ్చేశాడు. అఖిల్ నటించిన తొలి రెండు చిత్రాలు అఖిల్, హలో నిరాశపరిచాయి. అఖిల్ తన బాడీ లాంగ్వేజ్, లుక్ మార్చుకుని మూడవ చిత్రం మిస్టర్ మజ్నులో నటించాడు. తొలిప్రేమతో మ్యాజిక్ చేసిన యువదర్శకుడు వెంకీ అట్లూరి మిస్టర్ మజ్నుని కూడా రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందించాడు. అఖిల్ కు జోడిగా నిధి అగర్వాల్ నటించింది. ట్రైలర్, టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో మిస్టర్ మజ్ను చిత్రం పాజిటివ్ బజ్ తో నేడు విడులవుతోంది. ఇప్పటికే ప్రీమియర్ షోలు ప్రారంభంఅయ్యాయి. ప్రేక్షకుల నుంచి మిస్టర్ మజ్ను చిత్రానికి ప్రీమియర్ షోల రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం!

పాజిటివ్ బజ్‌తో

పాజిటివ్ బజ్‌తో

అఖిల్ సినిమా తొలిసారి పూర్తిగా పాజిటివ్ బజ్ తో విడుదలవుతోంది. దీనికి కాంబినేషన్ ఓ కారణం కాగా, మరో కారణం మిస్టర్ మజ్ను ట్రైలర్, టీజర్. అఖిల్ కూల్ లుక్ తో అదరగొడుతున్నాడు. వెంకీ అట్లూరి తనదైన శైలిలో మరో ప్రేమ కథ రూపొందించాడు. నేడు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. మిస్టర్ మజ్ను ఫస్ట్ హాఫ్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

హైలైట్స్ ఇవే

హైలైట్స్ ఇవే

చిత్రంలో అఖిల్ క్లాస్ లుక్ చూపు తిప్పుకోలేని విధంగా ఉంది. డాన్సులతో అఖిల్ మరోమారు ఆకట్టుకున్నాడు. అఖిల్ 8 ప్యాక్ కూడా ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రంలో అఖిల్ సరికొత్త బాడీ లాంగ్వేజ్ తో నటించాడు. నిధి అగర్వాల్ పాత్ర కూడా బావుంది. తొలి అర్థ భాగంలో దర్శకుడు తాను చెప్పాలనుకున్న పాయింట్ ఆడియన్స్ కు చేరవేయడంలో విజయవంతం అయ్యాడు. సెకండ్ హాఫ్ కాస్త నెమ్మదించిన ఫీలింగ్ ని ఆడియన్స్ వ్యక్తపరిచారు. ప్రియదర్శి, హైపర్ అది కామెడీ సన్నివేశాలు బావున్నాయి కానీ ఆశించిన స్థాయిలో హాస్యం పండలేదు.

చిత్రానికి మరో బలం

చిత్రానికి మరో బలం


సంగీత దర్శకుడు తమన్ అందించిన ఆల్బమ్ లో మూడు పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. పాటల చిత్రికరణ కూడా బావుంది. ఇక తమన్ అందించిన బ్యాగ్రౌండ్ సంగీతం చిత్రానికి మరో పిల్లర్ గా నిలిచింది అని చెప్పొచ్చు. అంతలా తమన్ బ్యాగ్రౌండ్ సంగీతంతో ఆకట్టుకున్నాడు.

ఎక్కడా తగ్గకుండా

ఎక్కడా తగ్గకుండా

ఎంటర్ టైన్మెంట్, ఎమోషన్ చిత్రంలో ఏదశలోనూ తగ్గకుండా దర్శకుడు వెంకీ అట్లూరి జాగ్రత్త పడ్డాడు. అలాగని చిత్రంలో 'హై' ఫీలింగ్ ఇచ్చే సన్నివేశాలు పెద్దగా లేవు. మొత్తంగా బాక్సాఫీస్ వద్ద అఖిల్ ఈ చిత్రంతో తొలి విజయం అందుకునే అవకాశాలు మెండుగా ఉన్నట్లు ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తోంది. అఖిల్ నటనకు, లుక్ కు మంచి స్పందన వస్తోంది. నిధి అగర్వాల్ కూడా ఈచిత్రంలో గ్లామరస్ గా కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X