మిస్టర్ మజ్ను దర్శకుడికి క్రేజీ ఆఫర్.. విజయ్ దేవరకొండతో భారీ స్థాయిలో!
Recommended Video

విజయ్ దేవరకొండ కోసం దర్శక నిర్మాతల్లో విపరీతమైన డిమాండ్ నెలకొనివుంది. విజయ్ దేవరకొండతో సినిమా చేసేందుకు పలువురు దర్శకుడు ఎగబడుతున్నారు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. కథ నచ్చితేనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో యువ దర్శకుడు వెంకీ అట్లూరికి బంపర్ ఆఫర్ తగిలినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండతో వెంకీ అట్లూరి జతకట్టబోతున్నాడనే వార్త ఆసక్తిగా మారింది.

యూత్ ఫుల్ లవ్ స్టోరీలు
వెంకీ అట్లూరి తొలి ప్రేమ చిత్రంతో దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్నాడు. తొలి ప్రేమ చిత్రం యువతని బాగా ఆకట్టుకుని మంచి విజయం సాధించింది. ప్రస్తుతం వెంకీ అట్లూరి మిస్టర్ మజ్ను రూపంలో మరో ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రంలో అఖిల్ హీరోగా నటించాడు. ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. మిస్టర్ మజ్ను చిత్రం జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

బంపర్ ఆఫర్
ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో యూత్ ఐకాన్ గా మారుతున్నాడు. విజయ్ దేవరకొండతో, బడా నిర్మాణ సంస్థలో సినిమా చేసే క్రేజీ ఆఫర్ ని వెంకీ అట్లూరి అందుకున్నట్లు తెలుస్తోంది. వెంకీ అట్లూరి, విజయ్ దేవరకొండ మధ్య జరిగిన ప్రాధమిక చర్చల్లో కథ ఒకే అయిందనే టాక్ వినిపిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ సంస్థ భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చిందట.

ఎలాంటి కథ
వెంకీ అట్లూరి విజయ్ దేవరకొండ కోసం కూడా ప్రేమ కథనే ఎంచుకున్నాడా లేక డిఫెరెంట్ కథని ట్రై చేస్తున్నాడా అనే విషయం తెలియాల్సి ఉంది. విజయ్ దేవరకొండ విభిన్న కథలకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. అర్జున్ రెడ్డి చిత్రంలో మద్యానికి బానిసగా మారిన డాక్టర్ పాత్రలో నటించాడు. గీత గోవిందం చిత్రం రొమాంటిక్ లవ్ స్టోరీగా అలరించింది. నోటా చిత్రంలో పాలిటిక్స్ ని టచ్ చేశాడు. టాక్సీవాలాతో హర్రర్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రంతో నటించాడు.

డియర్ కామ్రేడ్ తర్వాత
ప్రస్తుతం విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత కొందరు దర్శకులతో సినిమాలు చేసేందుకు విజయ్ కమిట్ అయి ఉన్నారు. దీనితో వెంకీ అట్లూరి, విజయ్ దేవరకొండ కాంబోలో చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియాలంటే డియర్ కామ్రేడ్ పూర్తయ్యే వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











