వెంకీ - బ్రహ్మీల పసందైన వింధు భోజనం ‘నమో వెంకటేశ’
తెలుగు తెరపై స్టార్ కమెడియన్ బ్రహ్మానందం. గత కొద్ది కాలంగా బ్రహ్మానందం వుంటే చాలు సినిమా హిట్టే. అనేంత రేంజ్ లో బ్రహ్మీ పై అంచనాలు పెరిగిపోయాయి సినిమా పరిశ్రమలో. ప్రస్తుతం వెంకటేష్ హీరోగా శ్రీను వైట్ల తెరకెక్కించిన 'నమో వెంకటేశ" సినిమాలో బ్రహ్మీ కామెడీ అత్యధ్భుతంగా వుంటుందట. ఈ విషయాన్ని స్వయంగా హీరో వెంకటేష్ చెబుతున్నాడు.
బ్రహ్మానందంని కమెడియన్ అనో, మరో పాత్ర అనో తాను చూడ్డంలేదనీ, 'నమో వెంకటేశ" సినిమాలో బ్రహ్మానందం సెకెండ్ హీరో అనీ వెంకటేష్ కితాబులిచ్చిన సంగతి తెల్సిందే. 'నువ్వు నాకు నచ్చావ్" తర్వాత తమ కాంబినేషన్ లో ఆ రేంజ్ కామెడీ 'నమో వెంకటేశ" లో పడిందనీ, శ్రీను వైట్ల సినిమాల్లో బ్రహ్మానందం పాత్ర నవ్వులకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుందనీ, అలాగే 'నమో వెంకటేశ" లో బ్రహ్మానందం పాత్ర అత్యద్భుతమనీ వెంకీ అభిప్రాయపడ్డాడు. వెంకీ సరసన త్రిష హీరోయిన్ గా నటించిన 'నమో వెంకటేశ" ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో, వెంకీ, బ్రహ్మీ ఏరేంజ్ లో టాలీవుడ్ తెరపై నవ్వులు కురుపించనున్నారో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











