మహేష్, బన్నీ, రామ్ చరణ్ రూట్ లో వెంకటేష్
యంగ్ జనరేషన్ హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు రూట్లో వెంకటేష్ కూడా ప్రయాణం పెట్టుకున్నారు. ఇన్నాళ్ళు యాడ్స్ కు దూరంగా ఉన్న వెంకటేష్ తాజాగా మనప్పురం అనే కేరళ ఫైనాన్స్ కంపెనీకి ఆంద్రా ఎంబాసిడర్ గా కనిపించటానికి కమిట్ అయ్యారు. ఈ కంపెనీ మంచి రెప్యుటేషన్ తో ఇండియా అంతటా 15 రాష్ట్రాల్లో బ్రాచిలు కలిగిఉంది. మళయాళంలో మోహన్ లాల్ ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటే కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజకుమార్ కర్ణాటకకు అంబాసిడర్ గా చేస్తున్నారు. ఇక నాగార్జున కూడా ఈ మధ్య ఓ హెయిర్ ఆయిల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా చేయటానికి కమిట్ అవ్వటంతో వెంకటేష్ కూడా ఈ దిశగా అడుగులు వేసారు. ప్రస్తుతం వెంకటేష్...ఆప్త రక్షక రీమేక్ లో చేస్తున్నారు. కన్నడంలో డైరక్ట్ చేసిన పి.వాసు ఈ చిత్రాన్ని తెలుగులోనూ దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











