వెంకీతో మంజుల సినిమా
తులసి సినిమా రికార్డు స్థాయిలో ఎక్కువ థియేటర్లలో 50 రోజులను పూర్తి చేసుకుని హీరో వెంకటేష్ కు కొత్త ఊపునిచ్చింది. ఈ సినిమా సృష్టించిన రికార్డుతోనో మరో కారణం చేతనో కానీ వెంకటేష్ మాత్రం ఈ మధ్య మనుసులో ఉన్న విషయాలన్నిటినీ బయటపెడుతున్నాడు. ఆ మధ్య ఆడ వేషం వేయాలని ఉందని చెప్పిన వెంకటేష్ ఈ మధ్య పవన్ కళ్యాణ్ తో మల్టీ స్టారర్ చిత్రం చేయడానికి రెడీ అని చెప్పాడు. తాజాగా ముంజులకు ఒక సినిమా చేస్తానని చెప్పాడు. గీతా ఆర్ట్స్, సురేష్ ప్రొడక్షన్స్ లాగా ఇందిరా ప్రొడక్షన్స్ వారు తమ సొంతవారితో కాకుండా బయటివారితో కూడా చిత్రాలు నిర్మించడానికి సన్నద్ధమవడం ఆసక్తి కలిగించే అంశం. ఇప్పటికే ఇందిరా ప్రొడక్షన్స్ అధినేత మంజుల విష్ణువర్థన్ తో సినిమా చేయడానికి ప్రకటన కూడా చేసింది. ఇపుడు వెంకటేష్ సినిమా తీయడానికి మంజుల సిద్ధమయింది. సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ ను కూడా వెంకటేష్ కు వినిపించిందట. అయితే స్క్రిప్ట్ కు సంబంధించి వెంకటేష్ ఇంకా తన స్పందనను చెప్పలేదట.


Click it and Unblock the Notifications











