వెంకటేష్ వార్త నిజమే

By Staff

Venkatesh
వెంకటేష్, కమల్ హాసన్ కలిసిపనిచేయనున్నరానే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా వార్తలు నిజం కాబోతున్నాయి. బాలీవుడ్ సూపర్ హిట్ ఎ వెడ్నస్ డే చిత్రంలో వీరిద్దరూ కాంబినేషన్ ప్రేక్షకులను ఆనందపరచనుంది. వాస్తవానికి కమల్ తన మర్మయోగి సినిమాలో వెంకీని తీసుకుందామనుకున్నారు. అయితే ఆర్థిక సమస్యల కారణంగా 'మర్మయోగి' ప్రాజెక్టు వాయిదా పడ్డాక కమల్హాసన్ ప్రత్యామ్నాయ ఆలోచనలో పడ్డారు.

తమిళంలో 'తలైవన్ ఇరుకిండ్రాన్' చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరపైకెక్కించాలను చూస్తున్న కమల్హాసన్ బాలీవుడ్ సూపర్హిట్ చిత్రం 'వెడ్నస్ డే'ను రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మళయాల భాషల్లో విడుదల చేసేందుకు యూనివర్శిల్ స్టార్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో నజరుద్దీన్ షా, అనుపమఖేర్ ప్రధాన పాత్రలు పోషించారు. అదే విధంగా రీమేక్ వెర్షన్లో వెంకటేష్ పెట్టుకోవాలని చూస్తున్న కమల్ మూడు భాషల్లోనూ నజరుద్దీన్ షా పాత్రను తానే పోషిస్తుండగా అనుపమఖేర్ పాత్రను తమిళ, మళయాలంలో మోహన్లాల్, తెలుగులో వెంకటేష్ కు ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

తీవ్రవాద దుష్ఫలితాల గురించి చెప్పే 'వెడ్నస్ డే' రీమేక్ షూటింగ్ త్వరలో ప్రారంభంకానున్నట్లు వినికిడి.మార్చి రెండవ వారంలో ప్రారంభం కానుంది. హైదరాబాద్ లో ఈ చిత్రం కోసం ప్రత్యేకమైన సెట్ రూపొందిస్తున్నారు. రాజకమల్ మూవీ బ్యానర్ పై చక్రి(సాగర సంగమం చిత్రంలో ఫొటో కుర్రాడు)ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. అలాగే హోమం నిర్మాత కిరణ్ కుమార్ ఈ రీమేక్ విషయమై యూటీవి వారిపై కోర్టు కెళ్ళారు. కొద్ది పాటి సెటిల్ మెంట్ తో ఇప్పుడా సమస్యలన్నీ తీరిపోయాయని సమచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X