నితిన్ సినిమా ఆగిపోయిందంటూ వచ్చిన వార్తల్లో వాస్తవమెంత!
ఛలో చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన వెంకీ కుడుములు తొలి ప్రయత్నంతోనే మంచి కమర్షియల్ విజయాన్ని అందుకున్నాడు. ఫ్యామిలీ ఎమోషనల్స్, కామెడీ ఇలా అన్ని అంశాలని వెంకీ కుడుములు ఛలో చిత్రంలో సమపాళ్లలో చూపించాడు. ఈ దర్శకుడికి మంచి డిమాండ్ ఏర్పడింది. వెంకీ కుడుములతో నితిన్ నెక్స్ట్ మూవీ ఉంటుందని ఆ మధ్యన వార్తలు వచ్చాయి.
ఈ చిత్రం ఆగిపోయిందని కూడా ఇటీవల ప్రచారం జరిగింది. తాజగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆగిపోయిందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని అంటున్నారు. వెంకీ కుడుములు ఇప్పటికే నితిన్ కోసం కథ సిద్ధం చేశాడని, ప్రస్తుతం కథకు తుది మెరుగులు దిద్దుతున్నాడని నితిన్ సన్నిహితులు చెబుతున్నారు.

అతిత్వరలో ఈ చిత్రం గురించి నితిన్ స్వయంగా ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది. నితిన్ ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న శ్రీనివాస కళ్యాణం చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఆగష్టు 9 న ఈ చిత్రన్ని విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











