twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    త్వరలోనే సాయి ధరమ్ తేజ్ పెళ్లి.. గుట్టు విప్పిన డైరెక్టర్.. అసలు కథ ఏంటంటే?

    |

    సాయి ధరమ్ తేజ్ నిన్న చేసిన రెండు ట్వీట్లు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. వరుణ్ తేజ్ పెళ్లిపై ఓ ట్వీట్, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో నో పెళ్లి అనే పాట గురించి మరో ట్వీట్ చేశాడు. ఈ రెండు ట్వీట్లు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. వరుణ్ తేజ్ పెళ్లిపై చేసిన ట్వీట్‌లో వరుణ్ తేజ్, నితిన్, వెన్నెల కిషోర్, మంచు లక్ష్మీ, లావణ్య, డైరెక్టర్ మారుతి ఎంటర్ కాగా.. సోలో బ్రతుకే సో బెటర్ ట్వీట్‌పై నితిన్, వెంకీ కుడుముల ట్వీట్స్ వేశారు. ఈ ట్వీట్స్ అన్ని చూసిన నెటిజన్స్ ఇది ట్విట్టర్‌లా లేదు మీ వాట్సప్ గ్రూపులా ఉందని సెటైర్స్ వేస్తున్నారు. అసలు ఆ కథ ఏంటో ఓ సారి చూద్దాం.

    వరుణ్ తేజ్ పెళ్లిపై సెటైర్స్..

    వరుణ్ తేజ్ పెళ్లిపై సెటైర్స్..

    వరుణ్ తేజ్ పెళ్లి అంటూ యూట్యూబ్‌లో లెక్కలేనన్ని వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిని చూపిస్తూ.. ఏంటి బావా నీకు పెళ్లంట కదా? అని సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు. ఈ మేరకు వరుణ్ తేజ్ స్పందిస్తూ.. దానికి ఇంకా టైమ్ ఉందిలే కానీ.. సింగిల్స్ అంటూ కొంతమంది మన గ్రూప్ నుంచి వెళ్లిపోతోన్నారని నితిన్, నిఖిల్, రానాపై సెటైర్స్ వేశాడు.

    నితిన్‌కు గిఫ్ట్..

    నితిన్‌కు గిఫ్ట్..

    ఈ ట్వీట్స్‌ మధ్యలో వెన్నెల కిషోర్ ఎంటర్ అయ్యాడు. సింగిల్స్ గురించి కొన్ని గ్రూపులను సూచిస్తూ కౌంటర్స్ వేశాడు. మీకేంటి పెళ్లైన వారు.. ఎన్ని పంచ్‌లైనా వేస్తారని నితిన్ ఓ కౌంటర్ వేశాడు. ఇలా నితిన్ ఎంట్రీ కావడం, తన గిఫ్ట్ ఏదని సాయి ధరమ్ తేజ్‌ను అడగటంతో.. సోలో బ్రతుకు సో బెటర్ నుంచి నో పెళ్లి సాంగ్‌ను విడుదల చేయాలని కోరాడు.

    నువ్వే రిలీజ్ చేయాలి..

    నువ్వే రిలీజ్ చేయాలి..

    నితిన్ తన గిఫ్ట్ గురించి అడగ్గానే.. ‘నేనేప్పుడో పంపేశా నితిన్ డార్లింగ్, సోమవారం నీ దగ్గరకి వస్తది. నువ్ ఎప్పుడు రిలీజ్ చేస్తావా అని దాని కోసం మింగిల్స్ అందరూ వెయిటింగ్. రిలీజ్ చేసేయ్.. సింగిల్స్ నుంచి మింగిల్స్‌కు అది అంకితం అవును ఈ సాంగ్ రిలీజ్ చేసేది నువ్వే' అని సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు.

    ఎంటరైన డైరెక్టర్..

    ఎంటరైన డైరెక్టర్..

    భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుముల ఎంటరై ఓ పంచ్ వేశాడు. సింగిల్స్ ఆంథమ్ అన్న కొన్ని రోజులకే నితిన్ ఎంగేజ్ అన్నారు.. ఇప్పుడు మీరు నో పెళ్లి అంటున్నారంటే.. నెక్స్ సీన్ ఏంటో పసిగట్టేశాను.. అడ్వాన్స్‌డ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సాయి ధరమ్ తేజ్ బ్రో అని ఓ ట్వీట్ చేశాడు.

    Recommended Video

    Bheeshma Success Meet
    షెర్లాక్ హోమ్స్ అంటూ సెటైర్స్..

    షెర్లాక్ హోమ్స్ అంటూ సెటైర్స్..

    ఈ కామెంట్‌కు స్పందించిన సుప్రీమ్ హీరో.. నువు డైరెక్టర్ అయి ఉంటే నాకు భయం వేసేదిరా షెర్లాక్ హోమ్స్ అని ఓ సెటైర్ వేశాడు. అహహ.. ఈ హోమ్స్ రెండు నెలలుగా హోమ్‌లోనే లాక్ అయి ఉన్నాడు అంటూ మరో పంచ్ వేశాడు. మొత్తానికి వీరందరి ట్వీట్స్‌తో నో పెళ్లి అనే పాట రిలీజ్‌కు ముందే వైరల్ అయింది.

    English summary
    Venky Kudumula Satires On Solo Brathuke So Better No Pelli Song. Sai Dharam Tej Solo Brathuke So Better First Single No Pelli Is Going To Be Released On 25th May.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X