ఎన్టీఆర్ తరువాత నితిన్.. అంతా రెడీ అవుతోంది..!
నితిన్ సినిమాల వేగం పెరుగుతోంది. నితిన్ నటిస్తున్న తాజాగా చిత్రం ఛల్ మోహన్ రంగ. ఈ చిత్రం ఏప్రిల్ లో విడుదలకు సిద్ధం అవుతోంది. అంతలోనే నితిన్ మరో చిత్రానికి రంగం సిద్ధం అవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని నితిన్ తో సినిమా చేయడానికి కసరత్తు మొదలు పెట్టింది. ఇటీవల ఛలో చిత్రంతో యువతని మెప్పించిన దర్శకుడు వెంకీ కుడుముల నితిన్ కోసం కథని తయారు చేసే పనిలో బిజీగా ఉన్నాడట. అన్ని కుదిరితే ఈ ఏడాదిలోనే ఈ చిత్రం ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

అ..ఆ..అదిరిపోయింది
హారిక అండ్ హాసిని నిర్మాణంలో నితిన్ నటించిన చిత్రం అ..ఆ.ఈ చితం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనితో హారిక హాసిని సంస్థ నితిన్ తో మరో చిత్రం చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది.
Recommended Video


దర్శకుడు అతడే
చలో చిత్రంతో విజయాన్ని అందుకున్న దర్శకుడు వెంకీ కుడుములపై నిర్మాతలందరి దృష్టి పడింది. సింపుల్ కథతో, తక్కువ బడ్జెట్ లో వెంకీ ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో అతడి టాలెంట్ ని ఉపయోగించుకోవడానికి ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎగబడుతున్నాయి. ముందుగా హారికా అండ్ హాసిని వారు వెంకీకి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. నితిన్ కోసం కథ రెడీ చేయమని చెప్పారట.

ఎన్టీఆర్ చిత్రంతో బిజీగా హారిక అండ్ హాసిని
హారికా అండ్ హాసిని సంస్థ ప్రస్తుతం ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినషన్లో రాబోతున్న సినిమాతో బిజీగా ఉంది. తదుపరి చిత్రం నితిన్ తో అని వార్తలు రావడం ఆసక్తికరంగా మారింది.

నితిన్ తదుపరి చిత్రం ఇదేనా
హారిక అండ్ హాసిని సంస్థ నిర్మిస్తున్న ఎన్టీఆర్ చిత్రం పూర్తి కావడానికి ఇంకా టైమ్ ఉంది. నితిన్ నటించిన ఛలో చిత్రం ఏప్రిల్ లో విడుదలైపోతోంది. ఈ నేపథ్యంలో నితీన్, వెంకీ కుడుముల చిత్రం వెంటనే ప్రారంభం అయ్యే అవకాశం లేదు. నితిన్ ఈ లోపు మరేదైనా సినిమాని ఒకే చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











