సమంత మూలంగా... మహేష్-వెంకీ సినిమా వాయిదా
సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె' చెట్టు అనే మల్టీ స్టారర్ చిత్రం రూపొందబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ నెల నుంచే సినిమా రెగ్యులూర్ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా...జనవరి 18కి వాయిదా పడింది. ఇందుకు కారణం హీరోయిన్ సమంతే.
తొలుత డిసెంబర్ నెల నుంచే డేట్స్ ఇచ్చిన సమంత అనుకోని పరిస్థితుల వల్ల వీలు కాదని చెప్పడంతో....జనవరి 18 నుంచి షూటింగ్ మొదలు పెట్టాలని నిర్ణయించారు. ఈ చిత్రం ద్వారా మహేష్ బాబు సరసన నటించే అవకాశం సమంత మరోసారి దక్కించుకుంది. వెంకీ మహేష్ బాబు అన్నయ్య పాత్రలో కనిపించనున్నారు. ప్రకాష్ రాజ్, జయసుధ ఇందులో పర్మినెంట్ రోల్స్ లో కనిపించనున్నారు. మిక్కీజె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఇక పోతే ఈ సినిమాలో కోస్టార్స్ గా నటిస్తున్న వెంకీ, మహేష్ బాబులు సంక్రాంతి బరిలో ఒకరితో ఒకరు ఢీకొట్టుకుంటుండటం విశేషం. వెంకీ నటించిన బాడీగార్డు, మహేష్ బాబు నటించిన బిజినెస్ మ్యాన్ సంక్రాంతి పండగ సందర్భంగా ఒకే సారి విడుదల అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











