మామాఅల్లుళ్ల కొత్త అవతారం.. నేటి సాయంత్రమే ముహుర్తం
రియల్ లైఫ్ క్యారెక్టర్స్ మామా అల్లుళ్లైన విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య రీల్ లైఫ్‌లోనే అవే పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులముందుకు రాబోతోన్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్‌తో సినిమాపై అంచనాలు పెంచేసిన చిత్రబృందం.. మరోసారి తమ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయింది.
దీపావళి కానుకగా తమ అభిమానులను అలరించేందుకు ఏదో ఒక అప్డేట్‌ను వదులుతున్న క్రమంలో వెంకీమామ చిత్రయూనిట్ కూడా అందుకు సిద్దమైంది. ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేందుకు మరో కొత్త పోస్టర్‌ను రెడీ చేసింది. నేటి సాయంత్రమే విడుదల చేసేందుకు ఓ ముహుర్తాన్ని ఫిక్స్ చేసింది.

ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందిస్తూ.. మామఅల్లుళ్ల కొత్త అవతారాన్ని చూడబోతోన్నారు.. సాయంత్రం నాలుగు గంటలకు.. చూస్తూనే ఉండండి అంటూ ట్వీట్ చేసింది. పాయల్ రాజ్‌పుత్, రాశీ ఖన్నా జంటగా నటిస్తోన్న ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తుండగా.. బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











