twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంకీ మామ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ ఎలా ఉందంటే!

    |

    Recommended Video

    Venky Mama Twitter Review || వెంకీ మామ ట్విట్టర్ రివ్యూ || Filmibeat Telugu

    రియల్ లైఫ్ మామా అల్లుళ్లు విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య రీల్ లైఫ్ మామా అల్లుళ్లుగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. వెంకీమామ సినిమా ద్వారా సందడి చేసేందుకు రెడీ అయ్యారు. ఈ రోజే (డిసెంబర్ 13) ఈ సినిమా విడుదల కానుంది. అయితే గత రాత్రి ఈ సినిమా ప్రీమియర్స్ యూఎస్‌లో ప్రదర్శించబడ్డాయి. ఈ మేరకు సినిమా చూసిన ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా వారి వారి స్పందన తెలిపారు. ఆ వివరాలు చూద్దామా..

    వెంకీమామ మూవీ

    వెంకీమామ మూవీ

    బాబీ (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో రూపొందింది 'వెంకీమామ' సినిమా. చిత్రంలో వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా నటించారు. వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్ నటించగా, నాగచైతన్యతో రాశీ ఖన్నా రొమాన్స్ చేసింది. దేవి శ్రీ ప్రసాద్, థమన్ సంయుక్తంగా బాణీలు కట్టారు. వెంకటేష్ పుట్టిన రోజు కానుకగా నేడు ఈ సినిమా విడుదలైంది.

    వెంకీ స్క్రీన్ ప్రెసెన్స్.. నాగ చైతన్య క్యారెక్టరైజేషన్

    వెంకీ స్క్రీన్ ప్రెసెన్స్ తప్పితే సినిమా అంతా సాధారణంగానే ఉంది. నాగ చైతన్య క్యారెక్టరైజేషన్ స్ట్రాంగ్ అనిపించలేదు. హీరోయిన్ పాత్రలకు పెద్దగా స్కోప్ లేదు. మ్యూజిక్ బాగుంది. ఫస్టాఫ్ మరియు సెకండాఫ్ యావరేజ్ అనిపించింది.

    వన్ మ్యాన్ షో.. సెకండాఫ్‌లో నాగచైతన్య

    విక్టరీ వెంకటేష్ వన్ మ్యాన్ షో చేశాడు. కామెడీ, ఎమోషన్, యాక్షన్ అన్నీ బాగా పండించాడు. సెకండాఫ్‌లో నాగచైతన్య పర్‌ఫార్‌మెన్స్ బాగుంది. పాయల్, రాశి ఖన్నా బాగా చేశారు.

    ఫస్టాఫ్ అంతా కామెడీ.. సెకండాఫ్ ఎమోషన్

    వెంకీమామ సినిమా ఫస్టాఫ్ అంతా కామెడీతో సాగుతూ సెకండాఫ్ ఎమోషనల్ సీన్స్ తో ఆకట్టుకుంది. వెంకటేష్ నటనతో ఆకట్టుకోగా, నాగ చైతన్య ఆర్మీ ఎపిసోడ్ లో రాణించాడు. ఈ రోజు నుంచి వెంకీ బాక్సాఫీస్ దాడి మొదలైనట్లే.

    45 కోట్లు గ్యారెంటీ

    వెంకీమామ సినిమా ఎమోషనల్ సీన్స్ తో హార్ట్ టచింగ్ సినిమాగా నిలుస్తుంది. లీడ్ యాక్టర్స్ అంతా బాగా చేశారు. మై గెస్సింగ్ 45 కోట్లు గ్యారెంటీ.

    అక్కినేని ఫాన్స్ డిసప్పాయింట్

    డైరెక్టర్ బాబీ అక్కినేని నాగ చైతన్య క్యారెక్టర్ కి పెద్దగా స్కోప్ ఇవ్వలేదు. అక్కినేని ఫాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. నేను మల్టీస్టారర్ సినిమా అనుకొని వెళ్ళాను కానీ చై క్యారెక్టర్ స్కోప్ డిసప్పాయింట్ చేసింది.

    మొత్తంగా గమనిస్తే ఇదీ పరిస్థితి

    మొత్తంగా గమనిస్తే ఇదీ పరిస్థితి

    ఇక మొత్తంగా గమనిస్తే ఫస్టాఫ్‌లో కామెడీ, ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయని తెలుస్తోంది. వెంకీ వన్ మ్యాన్ షో అనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. సెకండాఫ్‌లో ఆర్మీ ఎపిసోడ్ పై ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. చూడాలి మరి ఈ సినిమా బాక్సాఫీస్ హంగామా ఏ మేర చేస్తుందో!.

    English summary
    Daggubati Venkatesh and Naga Chaitanya playing lead roles in Venky Mama movie. This movie released today and getting twitter response is.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X