'నమో వెంకటేశ'లో వెంకీ పాత్ర

By Staff

నమో వెంకటేశ చిత్రంలో వెంకటేష్..వెంట్రాలక్విస్ట్ పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. ఓ బొమ్మను పట్టుకుని అందరినీ వినోదపరిచే ఈ పాత్ర బాగా వర్కవుట్ అవుతుందని అంటున్నారు.అందుకోసం వెంకటేష్ ప్రత్యేకమైన ట్రైనింగ్ ని సైతం పొందినట్లు తెలుస్తోంది. ఇక తన గొంతులో రకరకాల పాత్రలు వినిపించే ఈ తరహా పాత్రను గతంలో కమల్ హాసన్ ఇది కథ కాదు చిత్రంలో చేసారు.అందులోని అటు ఇటు కాని హృదయం తోటి..ఎందుకురా ఈ తొందరనీకు అనే పాట చాలా పాపులర్. అటువంటి సెంటిమెంట్ టచ్ నే ఈ చిత్రంలో వెంకీ క్యారెక్టర్ పండించనున్నట్లు తెలుస్తోంది. ఇక త్రిష హీరోయిన్ గా చేసే ఈ చిత్రంలో శ్రీను వైట్ల సినిమాలో రెగ్యులర్ గా కనిపించే బ్రహ్మానందం పాత్ర హైలెట్ అంటున్నారు. పూర్తి స్ధాయి ఫన్ తో నడిచే ఈ చిత్రం వెంకటేష్ కి నచ్చి వెంటనే ఓకే చేసాడని తెలుస్తోంది. ఈ శ్రీను వైట్ల చిత్రాన్ని సుంకర అనీల్ కుమార్ నిర్మిస్తున్నారు. ఆపర్చునేట్ ఛానెల్ (A) పెట్టిన అనీల్ వరసగా సినిమాలు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X