»   » ఈ సారి రవితేజతో వెంకటేష్ మల్టీ స్టారర్

ఈ సారి రవితేజతో వెంకటేష్ మల్టీ స్టారర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: విక్టరీ వెంకటేష్ ఈ మధ్య మల్టీస్టారర్ చిత్రాల్లోనే ఎక్కువగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేష్ తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, రామ్ తో కలిసి మసాలా, కమల్‌హాసన్ తో కలిసి ఈనాడు సినిమాలు చేసారు. ఇటీవల ఆయన పవన్‌ కళ్యాణ్ తో కలిసి చేసిన గోపాల గోపాల చిత్రం భారీ హిట్టయింది.

త్వరలో మరో మల్టీస్టారర్ చిత్రానికి వెంకటేష్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సారి ఆయన మాస్ మహారాజా రవితేజతో కలిసి చేయబోతున్నారు. బిందాస్, రగడ, దూసుకెళ్తా చిత్రాల ఫేం వీరుపోట్ల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. అన్నీ అనున్నట్లే జరిగితే ఈ ఏడాది చివరికల్లా సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లాలని సన్నాహాలు చేస్తున్నారు. తమిళ చిత్రం ‘జిల్లా'కు రీమేక్‌గా ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. మోహన్ లాల్, విజయ్ కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం అక్కడ ఓ మోస్తరు విజయం సాధించింది. జిల్లాలో శివన్ అనే పాత్రను మోహన్ లాల్ పోషించారు.

 Venky-Ravi Teja multi starrer

‘జిల్లా' మూవీ కథ విషయానికొస్తే..మధురై ఏరియాలో ఓ డాన్. తన డ్రైవర్ ఓ పోలీస్ అధికారి చేతిలో చనిపోవటంతో అతను కుమారుడు శక్తి(విజయ్)ని పెంచుతాడు. శక్తి చిన్నప్పటి నుంచి పోలీసులను ద్వేషిస్తూ ఎదుగుతాడు. అయితే పెంచిన తండ్రి క్రైమ్ సిండికేట్ ని కాపాడటానికి శక్తి పోలీస్ గా జాయిన్ అవుతాడు. అక్కడ నుంచి కథ టర్న్ తీసుకుంటుంది. ఓ సంఘటనకు చలించిన శక్తి... పోలీసులకు సపోర్టర్ గా మారతాడు. అంతేగాక తన పెంచిన తండ్రిని మారటానికి ప్రయత్నాలు చేస్తూంటాడు...ఆ క్రమంలో ఏం జరిగిందనేది మిగతా కథ .

English summary
As per film industry latest updates Venkatesh is gonna make his next big project with Ravi teja and an official statement regarding this film will be launched very soon.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu