డాన్ గెటప్: వెంకీ ‘షాడో’ ఫస్ట్ లుక్ అదిరింది

By Bojja Kumar

మెహర్ రమేష్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. వెంకీ ఇందులో మాఫియా డాన్ గా కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి 'షాడో' టైటిల్ పెడతారని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఇది కన్ ఫర్మ్ అయింది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఈ రోజు విడుదలయ్యాయి. పక్కన చూశారుగా...పొడవాటి జుట్టుతో, అచ్చం మాఫియా డాన్ లా వెంకటేష్ గెటప్ అదిరిపోయేలా ఉంది కదూ.

యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకీ సరసన తాప్సి నటించనుంది. హీరో శ్రీకాంత్ ఓ కీలక పాత్రలో నటించనున్నాడు. శ్రీకాంత్ సరసన మధురిమ నటిస్తోంది. ఈ చిత్రానికి గోపీమోహన్ కథ అందిస్తుండగా, కోన వెంకట్ సంభాషణలు సమకూర్చుతున్నాడు. థమన్ సంగీతం అందించనున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది.

ప్రస్తుతం వెంకటేష్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటిస్తున్నారు. జర్నీ ఫేం అంజలి అతని భార్యగా నటిస్తోంది. ఇందులో మహేష్ బాబు కూడా మరో హీరోగా చేస్తున్నాడు. దిల్రాజు ఈ చిత్రానికి నిర్మాత.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X