మళ్ళీ త్రిషతో వెంకి రొమాన్స్
త్వరలోనే త్రిషతో వెంకటేష్ ఓ రొమాంటిక్ కామిడీలో నటించబోతున్నాడని సమాచారం. ఇంతకుముందు ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే చిత్రంలో అలరించిన ఈ జంట త్వరలో మళ్ళీ వెండితెరను పలకరించనుండటం వెంకటేష్ అభిమానులను ఆనందపరిచే విషయం. ఇక ఈ కాంబినేషన్ ని ఈ సారి సెట్ చేసింది శ్రీను వైట్ల అని తెలుస్తోంది. తన కామెడీ మార్క్ కి వెంకటేష్ సాప్ట్ రొమాంటిక్ ఏంగిల్ ని కలిపి కథ తయారు చేసినట్లు చెప్తున్నారు.
అలాగే ఈ కథను ఢీ, రెడీ, కింగ్ చిత్రాల రచయిత కోనవెంకట్ పక్కాగా తీర్చిదిద్దారు. ఇక వెంకటేష్ తన ఈనాడు (ఎ వెడ్నస్ డే రీమేక్ )చిత్రం పూర్తి కాగానే ఈ షూటింగ్ లో పాల్గొననున్నారు. అయితే ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుందా లేక వేరే వారు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇక త్రిష ..శ్రీనువైట్లతో కింగ్ తర్వాత చేస్తున్న చిత్రం..అతను వర్క్ కల్చర్ తనకు బాగా నచ్చుతుందని అందుకే చేస్తున్నానని చెప్తోంది.


Click it and Unblock the Notifications











