విక్టరీ వెంకటేష్ వైఫ్ కన్‌ఫర్మ్!
విక్టరీ వెంకటేష్ వైఫ్ కన్‌ఫర్మ్ అయింది. ఆగండాగండీ...మేము చెబుతున్నది వెంకటేష్ తాజా సినిమా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా గురించి. ఈ చిత్రంలో వెంకీ సరసన భార్య పాత్రలో నటించే హీరోయిన్ కోసం గత కొన్ని రోజులుగా దర్శక నిర్మాతలు వెతుకులాట జరుపుతున్న సంగతి తెలిసిందే. త్రిష, భూమిక లాంటి వారిని అడిగినా వారు ఒప్పుకోలేదు. మహేష్ బాబుకు వదిన పాత్ర చేయాల్సి వస్తుందని వీరు నిరాకరించినట్లు అప్పట్లో చర్చించుకున్నారు. ఆ తర్వాత అనుష్క, అమలా పాల్ పేర్లు వినిపించాయి. అయితే అధికారికంగా మాత్రం వెల్లడి కాలేదు.
తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో వెంకీ వైఫ్ గా నటించేందుకు హీరోయిన్ 'అంజలి'ని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో షాపింగ్ మాల్ సినిమాతో పాటు, తాజాగా 'జర్నీ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అంజలి అయితే వెంకీకి సరిగ్గా సరిపోతుందని దర్శక నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంజలి కూడా వెంకీ సరసన నటించేందుకు అంగీకరించినట్లు సమాచారం. త్వరలోనే అధికారిక సమాచారం వెలువడే అవకాశం ఉంది.
దిల్ రాజు బ్యానర్లో రూపొందుతున్న ఈచిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. వెంకీ, మహేష్ మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత ఎంపికైంది. జనవరి 18న విశాఖలో షూటింగ్ ప్రారంభం అయింది. ప్రస్తుతం వెంకీ పైన కొన్ని సీన్ల చిత్రీకరణ జరుగుతోంది. త్వరలోనే వెంకటేష్ షూటింగులో జాయిన్ కాబోతున్నాడు.


Click it and Unblock the Notifications











