'వెన్నెల 1 1/2' కథ మొదలేమిటంటే...
ఇక ఈ చిత్రం కథ బ్యాంకాక్ లో జరుగుతుంది. స్టోరీలైన్ చూస్తే...విజయవాడలోనో, హైదరాబాద్‌లోనో చదివితే ఏం వస్తుంది? మహా అయితే మంచి ఉద్యోగం వస్తుంది. అదే... విదేశాలకెత్తే వూర్లో మంచి క్రేజ్ వస్తుంది. పైగా అక్కడి అమ్మాయిల్ని పటాయించొచ్చు. వారాంతాల్లో కావల్సినంత హంగామా చేయొచ్చు. ఆ అబ్బాయి కూడా అలాగే అనుకొన్నాడు. వెంటనే విమానం ఎక్కేశాడు. మరి అమ్మాయిల మనసులో స్థానం సంపాదించాడా? లేదా? ఈ విషయాలు తెలియాలంటే 'వెన్నెల వన్ అండ్ హాఫ్' చూడాల్సిందే. చైతన్యకృష్ణ, మోనాల్ గజ్జర్ జంటగా నటించారు.
ఈ చిత్రం కాన్సెప్టు గురించి దర్శకుడు వెన్నెల కిషోర్ వివరిస్తూ...సంతోషం అనేది మన చుట్టూ ఉండే వాతావరణం వల్ల రాదు. మనసు ప్రశాంతంగా ఉంటే నరకంలోనూ నవ్వుకోవచ్చు. లేదంటే స్వర్గంలోనూ సుఖం ఉండదు. ఈ విషయాన్నే మా సినిమాలో చెబుతున్నామన్నారు అన్నారు. దేవాకట్టా 'వెన్నెల' చిత్రానికి ఇది కొనసాగింపు. జీఆర్ 8 ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపెై వింటేజ్ క్రియేషన్స్ సమర్పణలో వాసు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రం నచ్చి ఎ టీవీ వాళ్లు అవుట్ రేట్ కు కొని రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. 'వెన్నెల' చిత్రం ద్వారా పరిచయమై, హాస్యనటుడిగా మంచి స్థానం సంపాదించుకున్నారు కిశోర్. ఒకవైపు నటుడిగా కొనసాగుతూ మరోవైపు ఆయన 'వెన్నెల వన్నండాఫ్' చిత్రానికి దరక్శకత్వం వహించారు. 'వెన్నెల'కు సీక్వెల్ ఇది. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న 'వెన్నెల 1 1/2' చిత్రానికి సంగీతం: సునీల్ కాశ్యప్, ఫోటోగ్రఫీ: సురేష్ భార్గవ్, సాహిత్యం: కృష్ణ చైతన్య, శ్రీమణి, సిరాశ్రీ అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications












