కడుపుబ్బా నవ్వించే ‘వెన్నెల వన్ అండ్ హాఫ్’
'వెన్నెల' చిత్రానికి సీక్వెల్‌గా వెన్నెల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'వెన్నెల 1 1/2'. చైతన్యకృష్ణ, మోనాల్‌గుజ్జార్ నాయకానాయికలుగా నటిస్తున్నారు. జి.ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై వాసు, వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో మంచి విజయం సాధించింది అంటూ ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ ఫిల్మ్ చాంబర్లో నిర్వహించారు.
నిర్మాత వర్మ మాట్లాడుతూ 'హాస్యకథా చిత్రాల్లో సరికొత్త కోణంలో తెరకెక్కుతున్న చిత్రమిది. రెండున్నర గంటల నాన్‌స్టాప్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు కిషోర్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు' అని తెలిపారు. 'వెన్నెల'తో కిషోర్‌కు కమెడియన్‌గా మంచి పేరు పొందాడు. తన టైమింగ్ అంటే నాకు చాలా ఇష్టం. కిషోర్ దర్శకుడిగా మారడం ఆనందంగా ఉంది. ఈ తొలి ప్రయత్నంతో తను తప్పకుండా విజయానికి చేరువ కావాలి అన్నారు.
వెన్నెల కిషోర్ మాట్లాడుతూ...ప్రస్తుతం మా చిత్రం పోస్టు ప్రొడక్షన్ పనుల్లో ఉంది. డబ్బింగ్ కొంత బ్యాలెన్స్ ఉంది. ఆగస్టు మొదటి వారంలో సినిమాని విడుదల చేస్తాం అన్నారు. సీనియర్ కామెడీ ఆర్టిస్టులంతా మా సినిమాలో నటించారు. వినోదానికి లోటు అనేది ఉండదు అని కిషోర్ వెల్లడించారు.
బ్రహ్మానందం, రఘుబాబు, శ్రవణ్, గిరిధర్, మాస్టర్ భరత్, తాగుబోతు రమేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: సునీల్ కశ్యప్, కెమెరా: సురేష్ బార్గవ్, కథ-దర్శకత్వం: వెన్నెల కిషోర్.


Click it and Unblock the Notifications











