దర్శకత్వం షురూ చేసిన ‘వెన్నెల’ కిషోర్

By Bojja Kumar

దేవాకట్ట దర్శకత్వంలో రూపొందిన 'వెన్నెల" చిత్రం ఎంతటి ప్రేక్షకాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పడు ఈ చిత్రానికి 'వెన్నెల 1.1/2"(వెన్నెల వన్ అండ్ హాప్) పేరుతో సీక్వెల్ రాబోతోంది. లవ్ ప్లస్ లాస్ ఓల్ క్యూబ్ మైనస్ లాజిక్ ఈ చిత్రం ఉప శీర్షిక. వెన్నెల చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించి అందరినీ నవ్వించిన ప్రముఖ హాస్య నటుడు వెన్నెలకిసోర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జీఆర్8 ప్రొడక్షన్స్ ప్రయివేట్ లిమిటెడ్ బ్యానర్ పై వాసు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు బుధవారం హైదరాబాద్ లో ప్రారంభం అయ్యాయి. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి ప్రముఖ దర్శకుడు దేవా కట్ట క్లాప్ ఇవ్వగా, 'వెన్నెల" నిర్మాత చలపతి మోహన్ రావు స్విచ్చాన్ చేశారు. నిర్మాత వాసు తొలి సన్ని వేశానికి గౌరవ దర్వకత్వం వహించారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ...వెన్నెల చిత్రానికి సీక్వెల్ నిర్మించడం ఎంతో ఆనందంగా ఉంది, ప్రేక్షకులు ఊహించని ఎన్నో ఆశ్చర్యాలు ఈ చిత్రంలో ఉంటాయి, పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది, ఈ నెల 28 వరకు హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ పూర్తయిన తర్వాత అమెరికా, బ్యాంకాక్, స్విట్జర్ లాండ్ లలో చిత్రీకరణ చేస్తాం అన్నారు. దర్శకుడు కిషోర్ మాట్లాడుతూ....తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖ హాస్య నటీనటులంతా ఈ చిత్రంలో ఉన్నారు, కథకు అనుగుణంగా ఈ చిత్రంలోని హీరో హీరోయిన్ల పేర్లను గోప్యంగా ఉంచుతున్నాం, తగిన సమయం చూసి వాటిని మేమే వెల్లడిస్తాం, పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో లవ్ స్టోరీ కూడా కొత్తగా ఉంటుందని తెలిపారు.

ఈ చిత్రానికి సంగీతం : సునీల్ కశ్యప్, పైట్స్ : నందు, కెమెరా : సురేష్ భార్గవ్, ఎడిటర్ : ధర్మేందర్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : శివ, శంకర్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X