'వెన్నెల వన్ అండ్ హాఫ్' రిలీజ్ ఎప్పుడంటే
స్టోరీలైన్ చూస్తే... విజయవాడలోనో, హైదరాబాద్‌లోనో చదివితే ఏం వస్తుంది? మహా అయితే మంచి ఉద్యోగం వస్తుంది. అదే... విదేశాలకెత్తే వూర్లో మంచి క్రేజ్ వస్తుంది. పైగా అక్కడి అమ్మాయిల్ని పటాయించొచ్చు. వారాంతాల్లో కావల్సినంత హంగామా చేయొచ్చు. ఆ అబ్బాయి కూడా అలాగే అనుకొన్నాడు. వెంటనే విమానం ఎక్కేశాడు. మరి అమ్మాయిల మనసులో స్థానం సంపాదించాడా? లేదా? ఈ విషయాలు తెలియాలంటే 'వెన్నెల వన్ అండ్ హాఫ్' చూడాల్సిందే.
చైతన్యకృష్ణ, మోనాల్ గజ్జర్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని వాసు, వర్మలు నిర్మించారు. వారు మాట్లాడుతూ.. కన్నీరు పెట్టించే సన్నివేశాలు, కంగారు పుట్టించే దృశ్యాలు ఇవేం మా సినిమాలో లేవు. కేవలం నవ్వించాలనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నం ఇది. ప్రతి పాత్రా వినోదాన్ని అందిస్తుంది. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామని అన్నారు. ఈ చిత్రం నచ్చి ఎ టీవీ వాళ్లు అవుట్ రేట్ కు కొన్నట్లు సమాచారం. సంగీతం: సునీల్ కశ్యప్
ఈ చిత్రం పూర్తవగానే వెన్నెల కిషోర్ స్టార్ కమిడెయిన్ బ్రహ్మానందం జప్పా టైటిల్ తో ఓ తెలుగు చిత్రం రూపొదించారు. ఈ చిత్రం ట్రైలర్ విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఓ స్టార్ హీరోయిన్ గెస్ట్ పాత్ర చేస్తున్న ఈ చిత్రాన్ని మరో కమిడెయిన్ వెన్నెల కిషోర్ స్క్రిప్టు వర్క్ చేసి మెప్పించి,డైరక్ట్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం లీడ్ రోల్ లో బ్రహ్మానందం కనిపిస్తారు. ఇక టాకీ పార్ట్ పూర్తయ్యాక భారీగా ఈ చిత్రం డిటేల్స్ ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఇక వెన్నెల చిత్రం తో పరిచయమైన వెన్నెల కిషోర్ ఇప్పుడు హీరోలతో సమానంగా సినిమాల్లో లీడ్ రోల్ చేస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన లవ్ లీ చిత్రాలలోనూ వెన్నెల కిషోర్ ఫుల్ లెంగ్త్ రోల్ ని చేసారు.


Click it and Unblock the Notifications












