twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'వెన్నెల 1 1/2‌' చిత్రం రిలీజ్ డేట్ ఖరారు

    By Srikanya
    |

    హైదరాబాద్: కమిడియెన్ వెన్నెల కిషోర్ దర్శకుడుగా మారి రూపొందించిన చిత్రం 'వెన్నెల 1 1/2‌'. చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత వర్మ మాట్లాడుతూ -''సినిమా ఆరంభం నుంచి చివరి వరకు వినోదంగా సాగుతుంది. వంద శాతం ప్రేక్షకులను నవ్విస్తుంది. సునిల్‌కశ్యప్ అందించిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా అన్ని వర్గాల వారికి నచ్చుతుందనే నమ్మకం ఉంది'' అని చెప్పారు. జీఆర్‌ 8 ప్రొడక్షన్స్‌ ప్రై.లి. పతాకంపై వాసు, వర్మ 'వెన్నెల 1 1/2' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    ఈ చిత్రం కథ బ్యాంకాక్ లో జరుగుతుంది. స్టోరీలైన్ చూస్తే...విజయవాడలోనో, హైదరాబాద్‌లోనో చదివితే ఏం వస్తుంది? మహా అయితే మంచి ఉద్యోగం వస్తుంది. అదే... విదేశాలకెత్తే వూర్లో మంచి క్రేజ్‌ వస్తుంది. పైగా అక్కడి అమ్మాయిల్ని పటాయించొచ్చు. వారాంతాల్లో కావల్సినంత హంగామా చేయొచ్చు. ఆ అబ్బాయి కూడా అలాగే అనుకొన్నాడు. వెంటనే విమానం ఎక్కేశాడు. మరి అమ్మాయిల మనసులో స్థానం సంపాదించాడా? లేదా? ఈ విషయాలు తెలియాలంటే 'వెన్నెల వన్‌ అండ్‌ హాఫ్‌' చూడాల్సిందే. చైతన్యకృష్ణ, మోనాల్‌ గజ్జర్‌ జంటగా నటించారు.

    నిర్మాతలు మాట్లాడుతూ..కన్నీరు పెట్టించే సన్నివేశాలు, కంగారు పుట్టించే దృశ్యాలు ఇవేం మా సినిమాలో లేవు. కేవలం నవ్వించాలనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నం ఇది. ప్రతి పాత్రా వినోదాన్ని అందిస్తుంది. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామని అన్నారు. ఈ చిత్రం నచ్చి ఎ టీవీ వాళ్లు అవుట్ రేట్ కు కొన్నట్లు సమాచారం. 'వెన్నెల' చిత్రం ద్వారా పరిచయమై, హాస్యనటుడిగా మంచి స్థానం సంపాదించుకున్నారు కిశోర్. ఒకవైపు నటుడిగా కొనసాగుతూ మరోవైపు ఆయన 'వెన్నెల వన్నండాఫ్' చిత్రానికి దరక్శకత్వం వహించారు. 'వెన్నెల'కు సీక్వెల్ ఇది.

    గతంలో విడుదలైన 'వెన్నెల' చిత్రానికి ఇది కొనసాగింపు. అలాగే వెన్నెల కిషోర్ మాట్లాడుతూ ''మా చిత్రం ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. వినోదానికి పెద్ద పీట వేసిన ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే విశ్వాసం మాకుంది'' అని తెలిపారు. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న 'వెన్నెల 1 1/2' చిత్రానికి సంగీతం: సునీల్‌ కాశ్యప్‌, ఫోటోగ్రఫీ: సురేష్‌ భార్గవ్‌, సాహిత్యం: కృష్ణ చైతన్య, శ్రీమణి, సిరాశ్రీ అందిస్తున్నారు.

    English summary
    
 Vennela Kishore’s Vennela 1 1/2 is finally going to release on September 21. Chaitanya Krishna and Monal Gajjar are playing the lead roles and it also stars Vennela Kishore and Brahmanandam in important roles. Most part of the film was shot in Bangkok and it’s said to be a sequel to Vennela. Sunil Kashyap has composed the music. Kishore, who shot to fame as a comedian with Deva Katta’s Vennela, is making his directorial debut with this film. Anil Sunkara, one of the producers of Dookudu, bought the film and made a lot changes to make it more appealing.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X