వెన్నెల చిత్రంతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు దేవ కట్టా మళ్ళీ రంగంలోకి దూకుతున్నారు. భారత సబ్బరన్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం. ఇక వెన్నెల చిత్రానికి ట్యూన్స్ అందించిన మహేష్ శంకర్ ఈ సారి కూడా పనిచేయనున్నారు. ఇక వెన్నెల చిత్రంతో పరిచయమై ఎదిగిన పార్వతి మిల్టన్ లా ఈసారి మరో కొత్త ఎన్నారై భామను ఎంపిక చేస్తున్నారని తెలుస్తోంది. ఇక దేవకట్టా మళ్ళీ ఈ సారి ఏ సంచలనం సృష్టించనున్నారో...బెస్టాఫ్ లక్