'వెన్నెల', 'బిందాస్‌' తర్వాత గుర్తింపు తెచ్చిన చిత్రమిదే

By Srikanya

'సాధారణంగా సినిమాకి ముందు చాలా మంది డైరక్టర్స్ 'ఈ సినిమాలో హీరో,హీరోయిన్స్ తర్వాత అంత ప్రాధాన్యమున్న పాత్ర నీదే' అని చెబుతుంటారు. తీరా చూస్తే నాలుగు రోజులకి మించి పని ఉండదు. కానీ 'లవ్‌లీ'లో మాత్రం నాకోసమే ఓ కథ ఉంది. 'వెన్నెల', 'బిందాస్‌' తర్వాత నాకు మళ్లీ అంతటి గుర్తింపు తెచ్చిన చిత్రమిదే'' అన్నారు వెన్నెల కిషోర్. వెన్నెల కిషోర్ తాజాగా బి.జయ డైరక్ట్ చేసిన 'లవ్‌లీ'లో నటించి నవ్వులు పండించారు. హీరో,హీరోయిన్స్ తో సమానంగా వెన్నెల కిషోర్ పాత్ర ఉండటంతో ఫస్టాఫ్ మొత్తం పంచ్ లతో నవ్వులతో గడిచిపోయింది. ఇదే విషయాన్ని వెన్నెల కిషోర్ ఉత్సాహంగా మీడియాతో పంచుకుంటూ ఇలా స్పందించారు.

అలాగే ...ప్రేక్షకుల్ని స్వేచ్ఛగా నవ్వించే అవకాశం ఈ చిత్రంతో నాకు లభించింది. నేను, చిన్మయి కలిసి కనిపించే ప్రతి సన్నివేశంలోనూ ప్రేక్షకులు నవ్వుకోవడం చూశాను. దర్శకురాలు జయ నా పాత్రని తీర్చిదిద్దిన విధానం ఎంతో తృప్తినిచ్చింది. ఇదివరకు ఏ సినిమాలో కూడా నేను డ్యాన్స్‌ చేయలేదు. తొలిసారి 'లవ్‌లీ'లో ఆ అవకాశం నాకు లభించింది. రాజేంద్రప్రసాద్‌తో కలిసి నటించడం ఒక చక్కటి అనుభవం. ఆది నటన, అనూప్‌ సంగీతం చాలా బాగున్నాయి. 'లవ్‌లీ' తర్వాత ఫేస్‌బుక్‌లో సంప్రదించేవాళ్లు ఎక్కువయ్యా రు''అన్నారు. వెన్నెల కిషోర్‌...'లవ్‌లీ' చిత్రంలో కిట్టు అనే పాత్రని పోషించి వినోదాన్ని పంచారు. ఆ చిత్రం ఇటీవలే 25 రోజలు పూర్తి చేసుకొంది.

ఇక లవ్ లీ చిత్రం..సాయికుమార్ కుమారుడు..ఆదికి రెండో చిత్రం. ఈ చిత్రాన్ని బి.జయ డైరక్ట్ చేసింది. పెద్ద హిట్ టాక్ తెచ్చుకోకపోయినా ఓ మాదిరి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో పాటలకు మంచి పేరు వచ్చింది. లవ్..ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. రాజేంద్రప్రసాద్..హీరోయిన్ తండ్రిగా..బొమ్మరిల్లులో ప్రకాష్ రాజ్ తరహా పాత్రను పోషించారు. ఇక ఆది నటనకన్నా డాన్స్ లకు బాగా మార్కులు పడ్డాయి. వెన్నెల కిషోర్ కామిడీనే ఈ సినిమాలో ఉన్నంతలో నిలబెట్టిందని చెప్పాలి. ఆది తన తదుపరి చిత్రంగా పిల్ల జమీందార్ చిత్రంతో హిట్ కొట్టిన అశోక్ దర్శకత్వంలో చిత్రం చేస్తున్నారు.

వెన్నెల కిషోర్ విషయానికి వస్తే..కమిడియెన్ గా బిజీగా ఉంటూనే...'వెన్నెల వన్‌ అండ్‌ హాఫ్‌'చిత్రాన్ని డైరక్ట్ చేసారు. ఈ చిత్రం కథ బ్యాంకాక్ లో జరుగుతుంది. స్టోరీలైన్ చూస్తే...విజయవాడలోనో, హైదరాబాద్‌లోనో చదివితే ఏం వస్తుంది? మహా అయితే మంచి ఉద్యోగం వస్తుంది. అదే... విదేశాలకెత్తే వూర్లో మంచి క్రేజ్‌ వస్తుంది. పైగా అక్కడి అమ్మాయిల్ని పటాయించొచ్చు. వారాంతాల్లో కావల్సినంత హంగామా చేయొచ్చు. ఆ అబ్బాయి కూడా అలాగే అనుకొన్నాడు. వెంటనే విమానం ఎక్కేశాడు. మరి అమ్మాయిల మనసులో స్థానం సంపాదించాడా? లేదా? ఈ విషయాలు తెలియాలంటే 'వెన్నెల వన్‌ అండ్‌ హాఫ్‌' చూడాల్సిందే. చైతన్యకృష్ణ, మోనాల్‌ గజ్జర్‌ జంటగా నటించున ఈ చిత్రాన్ని వాసు, వర్మలు నిర్మించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X