Just In
Don't Miss!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నితిన్ భార్య బర్త్ డే వేడుకలు.. పార్టీలో డైరెక్టర్, కమెడియన్‌ల సందడి
నితిన్ సతీమణి షాలిని బర్త్ డే వేడుకలు సన్నిహితుల సమక్షంగా గ్రాండ్‌గా జరిగాయి. పెళ్లి తరువాత వచ్చిన మొదటి బర్త్ డే కావడంతో నితిన్ తన స్నేహితుల ఆధ్వర్యంలోనే బర్త్ డేను సెలెబ్రేట్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు నితిన్ తన శ్రీమతిపై ప్రేమను కురిపించాడు. బర్త్ డే విషెస్ చెబుతూ వెరైటీ క్రేజ్ ఫోటోలను షేర్ చేశాడు. ఇక షాలినీ బర్త్ డే వేడుకల్లో వెన్నెల కిషోర్, వెంకీ కుడుముల సందడి చేశారు.

క్రేజీ ఫోటోతో విషెస్..
నా అందమైన భార్యకు హ్యాపీ బర్త్ డే. నా జీవితంలో నీతో గడిపిన రోజులే ఎంతో సంతోషమైనవి.. జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను.. నీతో ప్రేమలోనే ఉంటాను అంటూ క్రేజీ ఫోటోను షేర్ చేశాడు. ప్రస్తుతం నితిన్ షేర్ చేసిన ఫోటో తెగ వైరల్ అవుతోంది.

భీష్మ టీం..
నితిన్ తన భార్య బర్త్ డే వేడుకలకు తన ఫ్రెండ్స్ అయిన భీష్మ టీం మేట్స్‌ను ఆహ్వానించాడు. వెన్నెల కిషోర్, వెంకీ కుడుముల బర్త్ డే ఈవెంట్‌లో రచ్చ చేశారు. నితిన్ షాలిని వెన్నెల కిషోర్, వెంకీ కుడుముల కలిసి పార్టీలో తెగ సందడి చేసినట్టు తెలుస్తోంది.

స్పెషల్ విషెస్..
శాలినికి వెన్నెల కిషోర్ ప్రత్యేకంగా విషెస్ తెలిపాడు. నాకు తెలిసిన స్వీటెస్ట్ పర్సన్ షాలినీకి హ్యాపీ బర్త్ డే అని చెప్పుకొచ్చాడు.. ప్రపంచంలోని సంతోషం మంతా నీకే చెందాలంటూ విషెస్ అందించాడు. మొత్తానికి ఇలా భీష్మ టైంలోనే ఇంకా చాలా క్లోజ్ అయినట్టున్నారు.

దుబాయ్‌లో రచ్చ..
ఈ మధ్యే నితిన్ తన భార్యను దుబాయ్‌కు తీసుకెళ్లాడు. రంగ్ దే, అంధాదున్ షూటింగ్ కోసం దుబాయ్‌కి వెళ్లిన నితిన్ తన సతీమణిని కూడా వెంట తీసుకెళ్లాడు. ఓ వైపు షూటింగ్‌లు, మరో వైపు భార్యతో కలిసి నితిన్ దుబాయ్ వీధుల్లో రచ్చ రచ్చ చేశాడు.

బిజిబిజీగా..
నితిన్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. మొదటగా రంగ్ దే సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఆపై చెక్ చిత్రాన్ని ఫినిష్ చేసి.. అంధాదున్ మూవీని పని పట్టేలా ఉన్నాడు. ఇక నితిన్ ఈ మూడు ప్రాజెక్ట్‌ల తరువాత కొత్త సినిమాను అనౌన్స్ చేసే చాన్స్ ఉంది.