twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘వెన్నెల’ కిషోర్ హీరోగా చిత్రం...డిటేల్స్

    By Srikanya
    |

    హైదరాబాద్ : కమిడియన్ వెన్నెల కిషోర్ ఆ మధ్యన దర్శకుడుగా మారి 'వెన్నెల వన్‌ అండ్‌ హాఫ్‌' అనే చిత్రం రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దాంతో అతను పూర్తిగా నటన మీద దృష్టి పెట్టినట్లు సమాచారం. అందులో భాగంగా కిషోర్ కామిడీ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ చిత్రం పేరు 'అతడు... ఆమె... ఓ స్కూటర్'.గంగారపు లక్ష్మణ్ దర్శకత్వంలో పిరమిడ్ క్రియేషన్స్ పతాకంపై అమరేంద్రరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    వెన్నెల కిశోర్, ప్రియాంక చాబ్రా జంటగా నటిస్తున్న చిత్రం 'అతడు.. ఆమె.. ఓ స్కూటర్'. పిరమిడ్ క్రియేషన్స్ పతాకంపై అమరేంద్రరెడ్డి నిర్మిస్తున్నారు. గంగారపు లక్ష్మణ్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. చిన్నికృష్ణ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామానాయుడు స్టూడియోస్‌లో జరుగుతోంది. మంగళవారం సాయంత్రం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ "రాజేశ్ ఖన్నా కాలం నాటి పద్ధతులు గల ఓ యువకుడు పెళ్లి చేసుకునే క్రమంలో అతనికి ఎదురైన అనుభవాల్ని వినోదాత్మకంగా చూపిస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఆ పాత్రలో వెన్నెల కిశోర్ సరిగ్గా సరిపోయారు. ప్రస్తుతం రెండో షెడ్యూల్ జరుగుతోంది. విజయదశమి నుంచి పాటల్ని చిత్రీకరిస్తాం'' అని చెప్పారు.

    నిర్మాత అమరేంద్రరెడ్డి మాట్లాడుతూ "కథ బాగా నచ్చి ఈ సినిమా నిర్మిస్తున్నా. నవంబర్‌కు షూటింగ్ పూర్తి చేస్తాం. అదే నెలలో పాటల్నీ, డిసెంబర్‌లో సినిమానీ విడుదల చేస్తాం'' అన్నారు. హీరో కిశోర్ మాట్లాడుతూ "కామెడీ చేసుకుంటున్న నేను ఈ సినిమాకు హీరో అనగానే భయపడ్డా. కామెడీ సీన్స్ నచ్చి చేయడానికి ఒప్పుకున్నా. తాగుబోతు రమేశ్ ఇందులో ఓ పాటకూడా పాడాడు. అతను చేసే కామెడీ హైలైట్‌గా ఉంటుంది'' అని తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రామరాజు, కూర్పు: మేనగ శ్రీను.

    మరో ప్రక్క వెన్నెల కిషోర్....స్టార్ కమిడెయిన్ బ్రహ్మానందం తో జప్పా టైటిల్ తో ఓ తెలుగు చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ లో బ్రహ్మానందం..సంకెళ్లతో ఓ పోలీస్ అధికారి పట్టుకుని ఉంటాడు. అతన్ని నీ పేరేంటి అని అడుగుతాడు. ఎదురుగా ఉన్న బ్రహ్మానందం చెప్పడు. ఇరిటేషన్ తో ఆ పోలీస్ అధికారి..నీ పేరేంటిరా జప్పా అని అరుస్తాడు. అప్పుడు బ్రహ్మానదం..నా పేరు అదే అని కూల్ గా చెప్పుతాడు. ఆ తర్వాత బ్రహ్మానందం మర్డర్ చేయలేదు,రేప్ చేయలేదు,కిడ్నాప్ చేయలేదు అయినా మోస్ట్ వాంటెడ్ అని వస్తుంది. త్వరలోనే దొరుకుతాడు అనే టైటిల్ కార్డుతో ఈ ట్రైలర్ ముగుస్తుంది.

    English summary
    
 Vennela Kishore is going to play solo hero in a comedy film with the title 'Athadu Aame O Scooter'. This film will be directed by Lakshman.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X