'కెమెరామేన్ గంగతో..' పై వెన్నెల కిషోర్ కామెంట్
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. ఈ రోజు(గురువారం)విడుదల అవుతున్న ఈ చిత్రం పై హాస్య నటుడు మరియు రీసెంట్ గా దర్శకుడు గా మారిన వెన్నెల కిషోర్ తన దైన శైలిలో ట్విట్టర్ లో కామెంట్ చేసారు. ఆ ట్వీట్ ఏమిటంటే... ' మూవీ ప్లాప్ అయినా హిట్ అయినా పేపర్స్ అదే రేంజిలో ఎగురుతాయి,విజిల్స్ అదే రేంజిలో పడతాయి,నెక్స్ట్ సినిమాకి అదే రేంజిలో ప్లాన్స్ వుంటాయి, పవర్ స్టార్ మూవీ రిలీజ్ అనేది ఓ పెద్ద ఈవెంట్' అన్నారు. పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అయిన వెన్నెల కిషోర్ ..ట్విట్టర్ లో ఓ మిత్రుడు ఈ చిత్రం ప్లాప్ అవుతుంది అంటే ఇలా స్పందించి తన అభిమానం చాటుకున్నాడు.
ఇక వెన్నెల కిషోర్ ఆ మధ్యన దర్శకుడుగా మారి 'వెన్నెల వన్ అండ్ హాఫ్' అనే చిత్రం రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దాంతో అతను పూర్తిగా నటన మీద దృష్టి పెట్టినట్లు సమాచారం. అందులో భాగంగా కిషోర్ కామిడీ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ చిత్రం పేరు 'అతడు... ఆమె... ఓ స్కూటర్'.గంగారపు లక్ష్మణ్ దర్శకత్వంలో పిరమిడ్ క్రియేషన్స్ పతాకంపై అమరేంద్రరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
వెన్నెల కిశోర్, ప్రియాంక చాబ్రా జంటగా నటిస్తున్న చిత్రం 'అతడు.. ఆమె.. ఓ స్కూటర్'. పిరమిడ్ క్రియేషన్స్ పతాకంపై అమరేంద్రరెడ్డి నిర్మిస్తున్నారు. గంగారపు లక్ష్మణ్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. చిన్నికృష్ణ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామానాయుడు స్టూడియోస్‌లో జరుగుతోంది. మంగళవారం సాయంత్రం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ "రాజేశ్ ఖన్నా కాలం నాటి పద్ధతులు గల ఓ యువకుడు పెళ్లి చేసుకునే క్రమంలో అతనికి ఎదురైన అనుభవాల్ని వినోదాత్మకంగా చూపిస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఆ పాత్రలో వెన్నెల కిశోర్ సరిగ్గా సరిపోయారు. ప్రస్తుతం రెండో షెడ్యూల్ జరుగుతోంది. విజయదశమి నుంచి పాటల్ని చిత్రీకరిస్తాం'' అని చెప్పారు.
మరో ప్రక్క వెన్నెల కిషోర్....స్టార్ కమిడెయిన్ బ్రహ్మానందం తో జప్పా టైటిల్ తో ఓ తెలుగు చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ లో బ్రహ్మానందం..సంకెళ్లతో ఓ పోలీస్ అధికారి పట్టుకుని ఉంటాడు. అతన్ని నీ పేరేంటి అని అడుగుతాడు. ఎదురుగా ఉన్న బ్రహ్మానందం చెప్పడు. ఇరిటేషన్ తో ఆ పోలీస్ అధికారి..నీ పేరేంటిరా జప్పా అని అరుస్తాడు. అప్పుడు బ్రహ్మానదం..నా పేరు అదే అని కూల్ గా చెప్పుతాడు. ఆ తర్వాత బ్రహ్మానందం మర్డర్ చేయలేదు,రేప్ చేయలేదు,కిడ్నాప్ చేయలేదు అయినా మోస్ట్ వాంటెడ్ అని వస్తుంది. త్వరలోనే దొరుకుతాడు అనే టైటిల్ కార్డుతో ఈ ట్రైలర్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











