ఆ నా కొడుకు అంటూ శర్వానంద్ కామెంట్.. కౌంటర్ ఇచ్చిన వెన్నెల కిషోర్!
ఒకే ఒక జీవితం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శర్వానంద్ స్పీచ్ వైరల్ అయింది. వెన్నెల కిషోర్ హాజరుకాకపోవడంపై శర్వా స్పందిస్తూ.. ఆ నా కొడుకు మిస్ అయ్యాడు. వాడి సంగతి తర్వాత చూసుకొంటాను అంటూ కామెంట్ చేశాడు. ఆ వ్యాఖ్యలు యూట్యూబ్‌లో వైరల్ అయ్యాయి. సెప్టెంబర్ 10వ తేదీన నిర్వహించిన థ్యాంక్యూ మీట్‌లో శర్వానంద్ మాటలపై వెన్నెల కిషోర్ కౌంటర్ ఇస్తూ..

కాలేజీలో చదువుకొనేటప్పుడు
సినిమా గురించి మనమే బాగుందని చెబితే.. మనల్ని డబ్బా రాయుడు అని అనుకొంటారు. అయితే నేను డిగ్రీ చదువుకొనే రోజుల్లో ఒక జేబులో కర్చీఫ్.. మరో జేబులో పర్సు ఉండేది. బ్యాక్ పాకెట్‌లో దువ్వెన ఉండేది. అదో డిఫరెంట్ స్టోరి. కానీ మాస్టర్స్ చదువుకోవడానికి అమెరికా వెళ్లిన తర్వాత టిష్యూ పేపర్లు వాడటం అలవాటు అయింది. అప్పటి నుంచి కర్ఛిఫ్ వాడటం అలవాటు తప్పింది అని వెన్నెల కిషోర్ తెలిపారు.

కర్ఛీఫ్‌తో ఒకే ఒక జీవితం
ఒకే ఒక జీవితం రెండోసారి సినిమా చూసినప్పుడు మర్చిపోకుండా కర్చీఫ్ తీసుకెళ్లాను. సినిమా చూసేటప్పుడు నేను స్ట్రాంగ్ అనుకొన్నాను. ఎమోషనల్‌గా ఫీల్ కాననే అనుకొనే వాడిని. అమలా గారు సినిమాలో ఎంట్రీ ఇచ్చినప్పుడు కంటతడి మొదలై దానిని ఆపుకోవడం చాలా కష్టమైంది. ఈ సినిమా అంతా ఎమోషనల్‌గా ఉంది అని వెన్నెల కిషోర్ చెప్పారు.

ఆ నా కొడుకు అంటూ శర్వానంద్
ఇక ఆ నా కొడుకు మిస్ అంటూ శర్వానంద్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలపై వెన్నెల కిషోర్ సీరియస్‌గానే స్పందించాడు. ఎవరైనా ఏమైనా అనుకొన్నా సరే.. నాకు ఈ సినిమా ఆఫర్ ఇప్పించింది శర్వానంద్. ఓ షూటింగులో ఉంటే.. ఈ సినిమా మిస్ అయితే..నిజంగా ఏదో మిస్ అవుతావు అని చెప్పారు. ఈ రోల్ లభించడం మీరు లక్కీసార్ అని డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ చెప్పారు. చివరకు రెమ్యునరేషన్ ఇస్తారో లేదో అనే భయం కలిగింది. కానీ ఓ సీన్‌లో మ్యూజిక్ పెట్టి షూట్ చేసినప్పుడు ఈ డైరెక్టర్ మామూలోడు కాదు అనిపించింది అని వెన్నెల కిషోర్ చెప్పాడు.

శర్వానంద్ సార్ అలా డైలాగ్ కొట్టాడు
ఇక ఆ నా కొడుకు మిస్ అయ్యాడు అంటూ సార్ డైలాగ్ కొట్టాడు. ఇప్పుడు ఇంకో నా కొడుకు మిస్ అయ్యాడు. ఆయన సంగతేమిటి? అని వెన్నెల కిషోర్ అంటే.. కిషోర్ మిమ్మల్ని నిన్ను ఎంత మర్యాదగా పిలిచాను అని శర్వానంద్ సమాధానం చెప్పేందుకు ప్రయత్నించాడు. దాంతో యూట్యూబ్ చూడండి.. ఆ నా కొడుకు.. ఈ నా కొడుకు అని అన్నారు. నాకు తెలిసిన వాళ్లు ఏంటి శర్వా ఇలా అన్నాడేంటి అని అడిగితే సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది అని వెన్నెల కిషోర్ అన్నారు.

దర్శికి కూడా సేమ్ డైలాగ్ కొట్టు
అయితే నిన్ను ప్రేమతోనే అన్నాను అంటూ శర్వానంద్ అంటే... ఇప్పుడు సేమ్ డైలాగ్ దర్శికి కూడా అను అని వెన్నెల కిషోర్ పట్టుబట్టాడు. దాంతో దర్శి గారు ఎక్కడ ఉన్నా అని శర్వానంద్ అంటూంటే.. అలా కాదు.. దర్శి ఆ నా కొడుకు అని చెప్పు అని వెన్నెల కిషోర్ అంటే.. అలా అనడం సభా మర్యాద కాదు అని శర్వా అన్నాడు. దాంతో నేను సినిమా నేను ఇప్పించాను. నువ్వు ప్రెస్ మీట్‌కు రాలేదు కొడుకా అని అంటూ.. లవ్ యూ డార్లింగ్ చిన్నగా చెప్పాడు. లవ్ యూ డార్లింగ్ మాట ఎవడు కూడా వినలేదు అని అన్నాడు.

వెన్నెల కిషోర్‌ను బుజ్జగించిన శర్వా
దాంతో వెన్నెల కిషోర్ దగ్గరకు వచ్చి.. నా లైఫ్ అంతా నీవే అని బుజ్జగించారు. దాంతో కుట్లూ అంటూ వెన్నెల కిషోర్ పిలవడంతో వారి మధ్య ఫన్ మూమెంట్ క్రియేట్ అయింది. అలా సరదాగా వెన్నెల కిషోర్.. నవ్వుల్లో మునిగిపోయాడు. నిజంగా దర్శి కంప్లీట్ యాక్టర్. అమల గారితో నటించడం గర్వంగా ఉంది అని వెన్నెల కిషోర్ అన్నాడు.


Click it and Unblock the Notifications











