‘గబ్బర్ సింగ్’రికార్డ్ డిక్లేర్ చేసిన వెన్నెల కిషోర్
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'గబ్బర్ సింగ్'రిలీజైన రోజు నుంచి కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ సునామిలా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ మాట మేరకు చిత్ర నిర్మాత గణేష్ బాబు ఈ చిత్రం రికార్డులను ప్రకటించటం లేదు. ఎంత కలెక్షన్స్ వచ్చాయో అసలు తెలియ చేయటం లేదు. ఈ నేపధ్యంలో వెన్నెల కిషోర్ ఈ చిత్రం రికార్డు కలెక్షన్స్ తన ట్విట్టర్ లో ప్రకటించారు.
వెన్నెల కిషోర్ తన ట్వీట్ లో...ఈ మధ్య కాలంలో గబ్బర్ సింగ్ ఆల్ టైమ్ రికార్డ్..పది రోజులకి 52 కోట్లు కి పైగా కలెక్టు చేసింది అని ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ పవన్ కళ్యాణ్ అభిమానలును చాలా ఆనందపరిచింది. ఇది అఫీషియల్ గా వచ్చిన ఎమౌంట్ గా వారు భావిస్తున్నారు. ఇక ఈ కలెక్షన్స్ ఇలాగే రాబోయే రోజుల్లో కూడా కొనసాగితే తెలుగు ఇండస్ట్రీ విస్తుపోయే రికార్డుని సాధించినట్లే అంటున్నారు.
ప్రస్తుతం కమిడియెన్ వెన్నెల కిషోర్ దర్శకుడుగా మారి రూపొందిస్తున్న చిత్రం 'వెన్నెల వన్ అండ్ హాఫ్'. ఈ చిత్రం కథ బ్యాంకాక్ లో జరుగుతుంది. స్టోరీలైన్ చూస్తే...విజయవాడలోనో, హైదరాబాద్‌లోనో చదివితే ఏం వస్తుంది? మహా అయితే మంచి ఉద్యోగం వస్తుంది. అదే... విదేశాలకెత్తే వూర్లో మంచి క్రేజ్ వస్తుంది. పైగా అక్కడి అమ్మాయిల్ని పటాయించొచ్చు. వారాంతాల్లో కావల్సినంత హంగామా చేయొచ్చు. ఆ అబ్బాయి కూడా అలాగే అనుకొన్నాడు. వెంటనే విమానం ఎక్కేశాడు. మరి అమ్మాయిల మనసులో స్థానం సంపాదించాడా? లేదా? ఈ విషయాలు తెలియాలంటే 'వెన్నెల వన్ అండ్ హాఫ్' చూడాల్సిందే అన్నారు.
చైతన్యకృష్ణ, మోనాల్ గజ్జర్ జంటగా నటించున ఈ చిత్రాన్ని వాసు, వర్మలు నిర్మించారు. వారు మాట్లాడుతూ..కన్నీరు పెట్టించే సన్నివేశాలు, కంగారు పుట్టించే దృశ్యాలు ఇవేం మా సినిమాలో లేవు. కేవలం నవ్వించాలనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నం ఇది. ప్రతి పాత్రా వినోదాన్ని అందిస్తుంది. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామని అన్నారు. ఈ చిత్రం నచ్చి ఎ టీవీ వాళ్లు అవుట్ రేట్ కు కొన్నట్లు సమాచారం. సంగీతం: సునీల్ కశ్యప్


Click it and Unblock the Notifications











