చేతిపై పవన్ టాట్టూ...పండగ చేసుకున్నాడు(ఫొటో)
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ వీరాభిమానులు కేవలం బయిట మాత్రమే కాదు సినీ పరిశ్రమలోనూ ఉన్నారు. ఈ ఫోటో చూడండి..ఇక్కడ వెన్నెల కిషోర్ ఓ అభిమానిని చేతిని ఫోటో తీస్తున్నాడు. ఆ ఫోటో తీయటానికి కారణం ఆ చేతిపై పవన్ కళ్యాణ్ పేరు టట్టూ ఉండటమే. ఈ విషయంలో ఆనందపడిన వెన్నెల కిషోర్ వెంటనే తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా మిగతా అభిమానులతో పంచుకున్నాడు.

వెన్నెల సినిమాలో ఖాదర్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన కిషోర్ ఆ సినిమా టైటిల్ ని ఇంటి పేరుగా మార్చుకుని వెన్నెల కిషోర్ గా సెటిల్ అయ్యాడు. ఆ సినిమా తరువాత అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూనే వెన్నెల 1 1/2 సినిమాతో దర్శకుడిగా మారిపోయారు. ఆ సినిమా వర్కవుట్ కాలేదు తర్వాత కిషోర్ హీరోగా చిత్రాలు సైతం చేసాడు. అవీ పెద్దగా అతని కెరీర్ కి ప్లస్ కాలేదు. దాంతో తిరిగి కమిడియన్ గానే ప్రస్దానం కొనసాగిస్తున్నాడు.
అలాగే ఆ మధ్యన బ్రహ్మానందం హీరోగా వెన్నెల కిషోర్ చేసిన జప్పా చిత్రం సైతం భాక్సాఫీస్ వద్ద మార్నింగ్ షోకే కుప్పకూలింది. ప్రస్తుతం మహేష్ ఆగడులో కీలకమైన పాత్రను చేస్తున్నాడు. చిన్నా, పెద్దా సినిమాలతో పూర్తి బిజీగా ఉన్నాడు. కమిడియన్ గా అతనికి కంటిన్యూగా చిత్రాలు ఉంటూనే వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











