ఇబ్బంది పెట్టాను సారి..: ‘వెన్నెల’కిషోర్
సంగీత దర్శకుడు సునీల్ కాస్యప్ ని చాలా ఇబ్బంది పెట్టాను. అతనికి సారీ చెప్పుకుంటున్నాను అన్నారు వెన్నెల కిషోర్. కమిడియెన్ నుంచి దర్శకుడుగా మారిన కిషోర్ తాజాగా 'వెన్నెల వనండాఫ్'చిత్రం డైరక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియో పంక్షన్ హైదరాదాబ్ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే నాకు 'వెన్నెల' ఫస్టాఫ్ అంటే చాలా ఇష్టం. దాన్ని ప్రేరణగా తీసుకొని ఈ కథ తయారు చేశాను.'వెన్నెల'పై ఇష్టంతో సునీల్ కశ్యప్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా బాగా వచ్చింది. ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకంతో ఉన్నాం అన్నారు.
చైతన్యకృష్ణ, మోనాల్ గజ్జర్ జంటగా 'వెన్నెల'కిషోర్ దర్శకత్వంలో వాసు, వర్మ నిర్మిస్తున్న చిత్రం 'వెన్నెల వనండాఫ్'. వీవీ వినాయక్ ఆడియో సీడీని ఆవిష్కరించి మంచు మనోజ్, నారా రోహిత్‌లకు అందించారు. వినాయిక్ మాట్లాడుతూ...నిర్మాత వర్మ ఇటీవలే సింపుల్‌గా ఈ కథ చెప్పాడు. చాలా బాగుంది. 'వెన్నెల'తో కిషోర్ కమెడియన్‌గా మంచి పేరు పొందాడు. తన టైమింగ్ అంటే నాకు చాలా ఇష్టం. కిషోర్ దర్శకుడిగా మారడం ఆనందంగా ఉంది. ఈ తొలి ప్రయత్నంతో తను తప్పకుండా విజయానికి చేరువ కావాలి అన్నారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులతో పాటు, దేవ కట్టా, వరుణ్‌సందేశ్, అనిల్, సామ్రాట్, మధురిమ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.


Click it and Unblock the Notifications











