లక్ష్మీస్ ఎన్టీఆర్: ‘వెన్నుపోటు’ సాంగు రిలీజైంది...షాకిస్తున్న చంద్రబాబు విజువల్స్!
వివాదాస్పద సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రామ్ గోపాల్ వర్మ... త్వరలో మరో కాంట్రవర్సల్ మూవీ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన ఆయన తాజాగా 'వెన్నుపోటు' సాంగ్ విడుదల చేశారు.
ఎన్టీ రామారావు జీవితంలోకి రెండో భార్యగా లక్ష్మి పార్వతి ఎంటరైన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఏమిటి? ముఖ్యమంత్రిగా రామరావును పదవి నుంచి తొలగించింది ఎవరు? ఆయన్ను నమ్మించి వెన్నుపోటు పొడిచింది ఎవరు? అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు.

షాకిస్తున్న విజువల్స్
నా వాళ్లు అనుకున్న వారే మోసం చేయడంతో చివరి రోజుల్లో ఎన్టీ రామారావు ఎంత క్షోభపడ్డారు అనేది సినిమాలో ప్రధానంగా ఉండబోతోంది. తాజాగా లిరికల్ వీడియో సాంగులో వర్మ చూపించిన విజువల్స్ అందరికీ షాకిస్తున్నాయి.

చంద్రబాబు ఫోటోలతో సంచలనం
ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచింది ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు అని తరచూ ఇతర రాజకీయ పార్టీల నాయకులు ఆరోపిస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వెన్నుపోటు సాంగులో ఎన్టీఆర్ కంటే ఎక్కువగా చంద్రబాబు ఫోటోలు ఫోకస్ చేయడం చర్చనీయాంశం అయింది.

వెన్నుపోటు బాధను ఎలివేట్ చేసేలా మ్యూజిక్ అదుర్స్
ఎన్టీ రామారావు పడ్డ వెన్నుపోటు బాధను ఎలివేట్ చేసేలా కళ్యాణి మాలిక్ అందించిన సంగీతం అదరిపోయేలా ఉంది. ఆ పాటను పాడింది కూడా ఆయనే. తన గొంతుతో పాటలోని ఎమోషన్, పెయిన్ అద్భుతంగా పలికించారు.
సిరాశ్రీ లిరిక్స్
దగా దగా...
నమ్మించి నమ్మించి వెన్నుపోటు పోడిచారు
వంచించి వంచించి వెన్ను పోటు పోడిచారు.
కుట్ర.. కుట్ర.. కుట్ర
పొంచి పొంచి పడగలే ఎత్తివీళ్లు
కుటిలనీతి విషమునే చిమ్మినారు
దొంగప్రేమ నటనలే చూపివీళ్లు
కలియుగాన శకునిలై చేరినారు
దహించనే దురాగతం.. క్షమించ సాధ్యమా?
కుట్ర.. కుట్ర.. కుట్ర
ఐనవాళ్లు అక్కరతీరి వదిలివేసినారు
అసలు రంగు బయటపెట్టి కాటు వేసినారు
ఒంటరినే చేసి గుంపు దాడి చేసి
సొంతగూటి నుంచి కూడా వెలివేసినారు
కుట్ర.. కుట్ర.. కుట్ర
న్యాయమనే కోటను కాల్చి తగలబెట్టినారు
నీతికేమో గొయ్యితీసి పాతిపెట్టినారు
గోతికాడ నక్కలల్లె మాటువేసి
ఆత్మగౌరవాన్ని చంపి ఆహుతిచ్చినారు


Click it and Unblock the Notifications











