twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెన్నుపోటు: ట్వీట్లతో చిచ్చు... సోషల్ మీడియాలో మంటలు రేపుతున్న ఆర్జీవీ!

    |

    రామ్ గోపాల్ వర్మ తలుచుకుంటే తన సినిమా ప్రమోషన్స్‌ను పరాకాష్ఠకు ఎలా తీసుకెళతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందుకోసం ఎంతటి వివాదాలు క్రియేట్ చేయడానికైనా ఆయన వెనకాడరు. తన తాజా చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విషయంలో ఆర్జీవీ ప్లే చేస్తున్న ప్రమోషన్ స్ట్రాటజీస్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

    ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన 'వెన్నుపోటు సాంగ్' విడుదల చేసిన వర్మ... అందులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఫోకస్ చేయడం ద్వారా సెన్సేషన్ క్రియేట్ చేశారు. దీని ద్వారా రగలిన వివాదాన్ని మరింత పెద్దగా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ట్వీట్లతో చిచ్చు పెట్టి సోషల్ మీడియాలో మంటలు రేపుతున్నాడు.

    కీరవాణి, కళ్యాణ్ మాలిక్ మధ్య

    కీరవాణి, కళ్యాణ్ మాలిక్ మధ్య

    ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి కీరవాణి సంగీతం అందించగా.... లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీకి కీరవాణి సోదరుడు కళ్యాణి మాలిక మ్యూజిక్ సమకూచ్చారు. కీరవాణి కంపోజ్ చేసిన పాటకు 12 రోజుల్లో 1.6 మిలియన్ వ్యూస్ రాగా, కళ్యాణి మాలిక్ కంపోజ్ చేసిన ‘వెన్నుపోటు' సాంగ్ కేవలం 2 రోజుల్లోనే 1.6 మిలియన్ అధిగమించింది. ఇదంతా పైన ఉన్న ఎన్టీఆర్ ఆశీర్వాద మహిమే అంటూ వర్మ ట్వీట్ చేశారు.

    నేను డైరెక్టుగా ఒక్క మాట అనలేదు

    నేను సిబిఎన్ గారిని డైరెక్ట్ గా ఒక్కమాట కూడా అనలేదు ...అలాంటిది నా మీదే కేసులు పెడితే డైరెక్ట్ గా దూషించిన ఈ క్రింది వీడియో లోని వ్యక్తి మీద ఎన్ని కేసులు పెట్టాలి ? అంటూ... రామ్ గోపాల్ వర్మ ఎన్టీ రామరావు స్వయంగా మాట్లాడిన వీడియో షేర్ చేశారు.

    బెదిరింపు వీడియోలు సైతం షేర్ చేసిన ఆర్జీవీ

    తనకు వస్తున్న బెదిరింపులకు సంబంధించిన వీడియోలను సైతం రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం. వర్మ చేస్తున్న ట్వీట్స్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను మరింత హైలెట్ చేస్తున్నాయి.

    ఎన్టీఆర్ బయోపిక్, లక్ష్మీస్ ఎన్టీఆర్ కార్టూన్లు

    ఎన్టీఆర్ బయోపిక్, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలపై వేసిన కార్టూన్లను సైతం ఆర్జీవీ అభిమానులతో పంచుకున్నారు. ఇందులో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' కార్టూన్‌లో ఎన్టీ రామారావును కత్తితో వెన్నుపోటు పొడిచినట్లు చూపించడం గమనార్హం.

    ఎమోషనల్ వీడియో

    ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలోని వెన్నుపోటు సాంగును రామారావు చనిపోయినప్పటి విజువల్స్‌కు జోడించి విడుదల చేయగా..... అన్నగారి అంతిమ యాత్రను గుర్తు చేసుకుని అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు.

    English summary
    "Hey kalyanimalik31 , Your vennupotu song from #LakshmisNTR got more views in 2 days than 12 days of ur brother mmkeeravaani ‘s song from NTR biopic ..This proves that NTR from heaven is blessing you and sirasri SatyamevaJayate." RGV tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X