వేణు-కమిలిని ముఖర్జీ 'రామాచారి' విడుదల ఖరారు
హైదరాబాద్ : తొట్టెంపూడి వేణు, కమలిని ముఖర్జీ జంటగా జి. ఈశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎస్.పి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పి.వి.శ్యాంప్రసాద్ నిర్మించిన చిత్రం 'రామాచారి' . 'ఈడో పెద్ద గూఢచారి' అన్నది ఉపశీర్షిక. ఈ నెల 17న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.
చిత్రం కాన్సెప్టు గురించి చెప్తూ హీరో వేణు...అతగాడి పేరు రామాచారి. చిన్నప్పటి నుంచీ పోలీస్ అధికారి కావాలని కలలు కంటాడు. ప్చ్... అనుకున్నది సాధించలేకపోతాడు. చివరాఖరికి గూఢచారిగా మారతాడు. అక్కడి నుంచి అతను చేసే అన్వేషణలు కావల్సినంత వినోదాన్ని పంచుతాయన్నారు .
దర్శకుడు చిత్రం గురించి చెబుతూ ''ఒక మామూలు గూఢచారి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎలా కాపాడాడన్నదే కథ. వంద శాతం వినోదాన్ని అందించేలా రూపొందించారు''అన్నారు.
అలాగే... 'నేను దర్శకత్వశాఖలోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో మలయాళంలో వచ్చిన 'సి.ఐ.డి మూస' చిత్రాన్ని ఇప్పుడు నా దర్శకత్వంలో 'రామాచారి'గా రూపొందించడం చాలా సంతోషంగా ఉంది. పూర్తి స్థాయి వినోదభరిత చిత్రమిది' అన్నారు.
బ్రహ్మానందం, ఆలీ, ఎల్.బి.శ్రీరామ్, గిరిబాబు, చంద్రమోహన్, రఘుబాబు, వేలు, బాలయ్య, మురళీశర్మ, రాజ్‌ప్రేమి, ప్రభు, అమిత్, హర్షవర్ధన్, ఇందుఆనంద్, లిరిష తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: వి.విక్రమ్‌రాజు, డొంగ్రత్, నాగరాజు, రైటర్ మోహన్, కథ: ఉదయ్‌కృష్ణ, సిబికె థామస్, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సంగీతం: మణిశర్మ, ఫొటోగ్రఫీ: కె.ప్రసాద్, కో ప్రొడ్యూసర్స్: బి.మురళి, పి.వి.నాగేశ్వరరావు, నిర్మాత: పి.వి.శ్యాంప్రసాద్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.ఈశ్వర్‌రెడ్డి.


Click it and Unblock the Notifications












