చిరు 150వ సినిమా: చరణ్ మాటిచ్చాడంటున్న వేణు మాధవ్
హైదరాబాద్: మెగా స్టార్ చిరంజీవి 150వ సినిమా త్వరలో రాబోతున్న సంగతి తెలిసిందే. కథ ఫైనలైజ్ అయిన వెంటనే రామ్ చరణ్ స్వయంగా ఈ చిత్రం నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఈ చిత్రానికి ఇంకా దర్శకుడు ఖరారు కాలేదు. విచిత్రం ఏమిటంటే అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఓ వ్యక్త పేరు తెరపైకి వచ్చింది. చిరంజీవి 150వ సినిమాలో రామ్ చరణ్ తనకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశం ఇస్తానని మాటిచ్చినట్లు హాస్య నటుడు వేణు మాధవ్ చెబుతున్నారు.
చిరంజీవి కుటుంబంతో నాకు మంచి అనుబందం ఉన్నది. ఆయనతో చాలా సినిమాలు చేశాను. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ మినహా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ హీరోస్ అందరితో నటించాను. అవకాశం వస్తే వరుణ్ తేజ్ కి ఫ్రెండ్ గా నటిస్తా. అలాగే చిరంజీవి గారి 150 సినిమాలో నాకు మంచి పాత్ర ఉంటుందని భరోసాగా చెబుతున్నాడు వేణు మాధవ్.

వేణు మాధవ్ విషయం పక్కన పెడితే...చిరంజీవి 150వ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈచిత్రం నిర్మాణ బాధ్యతలను రామ్ చరణ్ దగ్గరుండి చూసుకోబోతున్నారు. చిరంజీవి భార్య సురేఖ నిర్మాతగా వ్యవహరించనున్నారు. కథ ఓకే అయిన వెంటనే దర్శకుడు ఎవరనేది ప్రకటించనున్నారు.
ప్రేక్షకులు, అభిమానుల అభిరుచి మేరకు 150వ సినిమా పూర్తి స్థాయి వినోదాత్మక అంశాల వేళవింపుతో ఉండేలా చిరంజీవి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











