ఎనిమిది వందల జీతంతోనే.. :వేణుమాధవ్‌

By Srikanya

Venu Madhav
హైదరాబాద్ : ''నెలకు ఎనిమిది వందల జీతంతో నా జీవితం ప్రారంభమైంది. అనుకోకుండా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాను. ప్రేక్షకులు నన్ను తమలో ఒకరిగా భావించి ఆదరించారు. పదిహేడేళ్లుగా సాగుతున్న ఈ నటప్రయాణం ఎంతో సంతృప్తినిస్తోంది''అన్నారు హాస్య నటుడు వేణుమాధవ్‌. తెరపై నవ్వులు పండించడంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పాటు చేసుకొన్నారాయన. హీరోగానూ వినోదాలు పంచారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

వేణు మాధవ్ మాట్లాడుతూ ''నేనిక్కడికి ఏమీ తీసుకురాలేదు. అన్నీ చిత్ర పరిశ్రమే ఇచ్చింది. నాకు దక్కిన గుర్తింపు, గౌరవానికి తగిన న్యాయం చేస్తే చాలనుకొంటుంటాను. ప్రేక్షకులకు స్వచ్ఛమైన వినోదాన్ని అందించినప్పుడే తృప్తి. అలాంటి పాత్రల్నే ఎంచుకొంటున్నా. ఇంతమందిని నవ్వించే అవకాశం లభించడం నాకు ఆ దేవుడిచ్చిన వరం. దర్శకులు, నిర్మాతలు అందిస్తున్న ప్రోత్సాహం ఎప్పటికీ మరిచిపోలేనిది''అన్నారు.

ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి మాట్లాడుతూ ''ఇప్పటిదాకా చేయని ఓ కొత్తరకమైన పాత్రని 'రుద్రమదేవి'లో పోషిస్తున్నాను. అలాగే 'రేయ్‌', 'మసాలా', 'ఆటోనగర్‌ సూర్య' తదితర చిత్రాల్లోనూ వైవిధ్యమైన పాత్రలు దక్కాయి. రానున్న రోజుల్లో మరిన్ని మంచి పాత్రలు చేస్తా'' అన్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'మసాలా', 'రేయ్‌', 'ఆటోనగర్‌ సూర్య' తదితర చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం 'రుద్రమదేవి'తో పాటు అల్లరి నరేష్‌ సినిమాలోనూ నటిస్తున్నారు.

ఇక వేణు మాధవ్ ఈ రోజుల్లో ఓ పాపులర్ కమిడియన్. ఆ మధ్యన ప్రేమాభిషేకం వీడికి కాన్సర్ లేదు చిత్రంతో హీరోగా కూడా తెరంగ్రేటం చేసిన వేణు మాధప్ ఇప్పుడు కొత్త నీరు రావటంతో పెద్దగా అవకాశాలు లేకుండా పోయాయి. అడపాదడపా పెద్ద హీరోల చిత్రాలలో పాత్రలు చేస్తున్నాడు. మిమిక్రీ చేయగలిగే వేణు మాధవ్ అద్బుతమైన కమిడియన్ అని,లైవ్ లో కూడా బాగా నవ్విస్తాడని సినీ వర్గాలు చెప్తూంటాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X