twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనారోగ్యంతో వేణు మాధవ్ హాస్పటిల్ కి..

    By Srikanya
    |

    ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ మరో సారి హాస్పటిల్ జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఈటీవీ కోసం జీనియస్ అనే పోగ్రాం చేస్తున్న వేణు మాధవ్ కి ఫిట్స్ రావటంతో కొత్త పేట లోకల్ హాస్పటిల్ లో జాయిన్ చేసారు. అతన్ని పరీక్షించిన డాక్టర్స్ అతను అవుటాఫ్ డేంజర్ అని ప్రస్తుతం బాగానే ఉన్నాడని ట్రీట్ మెంట్ చేస్తున్నారు. ఇక గతంలోనూ రచ్చ చిత్ర షూటింగ్ లో వేణు మాధవ్ హఠాత్తుగా ఇలా ఫిట్స్ వచ్చి పడిపోవటంతో హాస్పటిల్ కి తీసుకెళ్ళారు. పరిశ్రమలోని అతని మిత్రులు,శ్రేయాభిలాషులు ఫోన్ లు చేసి అతన్ని పరామర్శిస్తున్నారు. మైక్రో బ్లాగింగ్ సైట్స్, సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో అతను త్వరగా కోలుకోవాలని సందేశాలు పెడుతున్నారు.

    ఇక వేణు మాధవ్ ఈ రోజుల్లో ఓ పాపులర్ కమిడియన్. ఆ మధ్యన ప్రేమాభిషేకం వీడికి కాన్సర్ లేదు చిత్రంతో హీరోగా కూడా తెరంగ్రేటం చేసిన వేణు మాధప్ ఇప్పుడు కొత్త నీరు రావటంతో పెద్దగా అవకాశాలు లేకుండా పోయాయి. అడపాదడపా పెద్ద హీరోల చిత్రాలలో పాత్రలు చేస్తున్నాడు. మిమిక్రీ చేయగలిగే వేణు మాధవ్ అద్బుతమైన కమిడియన్ అని,లైవ్ లో కూడా బాగా నవ్విస్తాడని సినీ వర్గాలు చెప్తూంటాయి. అతను త్వరగా కోలుకుని తిరిగి సినీ జీవిన స్రవంతిలో కలిసి తన హాస్య నటనను కంటిన్యూ చేయాలని ధట్స్ తెలుగు కోరుకుంటోంది.

    English summary
    Venu Madhav was admitted in a local hospital at Kothapet as the actor suffered severe fits while shooting for a show titled Genes in popular Television channel ETV.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X